SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

మద్యం అక్రమ రవాణా కు తెలివిగా చెక్ పెట్టిన పోలీసులు*

1 min read

కృష్ణాజిల్లా వత్సవాయి

*

_ది :14.07.2021 వ తేదీన ఉదయం 11.30 గంIIల సమయంలో వత్సవాయి మండలం , వత్సవాయి బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద వత్సవాయి పోలీసు స్టేషన్ SI గారు, మరియు సిబ్బంది అయిన PCs–1825,2143,1005 కలిసి వాహనాలు తనిఖి చేయుచుండగా బోనకల్ వైపు నుండి ఒక కారు, రెండు బైక్ లపై వస్తున్న ఐదుగురు వ్యక్తులు యూనిఫారం లో ఉన్న పోలీసు వారిని చూసి వారి వాహనాలను వెనుకకు తిప్పి పారిపోవుటకు ప్రయత్నించగా si గారు వారి సిబ్బంది సహయంతో అదుపులోకి తీసుకొని వారిని తీసుకు వచ్చి ప్రశ్నించారు_

_వారి పేర్లు 1.పండగ నాగార్జున , 2.నిమ్మకాయల చందన 3. షేక్ హుస్సెన్ 4. వేలదినేని సత్యప్రసాద్, 5).బంకా కనకరత్నం అందరిది వత్సవాయి మండలం అని వీరు ఐదుగురు మంచి స్నేహితులు అయినట్లు వీరు బాగా జల్సాలకు అలవాటు పడి వారి జల్సాలకు కావలసిన డబ్బులను తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న ట్లు తెలిపారు_

_దబ్బాకుపల్లి గ్రామ శివారులో కారు, బైక్ లపై ఉండి తెలంగాణా నుండి AP 16 BV 3844 నెంబర్ గల బైక్ పై వస్తున్న నందిగామకు చెందిన షన్ముఖ సాయి కుమార్ అనే అతనిని ఆపి మేము పోలీస్ లము అని చెప్పి అతనిని 50,000/- రూపాయలు డిమాండ్ చేయగా అతని వద్ద అంత డబ్బులు లేవు అని ఎకౌంటు లో 7000/- రూపాయలు ఉన్నాయి అని అనగా అప్పుడు పండగ నాగార్జున అనే వ్యక్తి తన యొక్క 7799665956 నెంబర్ కి షన్ముఖ సాయి కుమార్ యొక్క 9154456643 అను నెంబర్ నుండి ఫోన్ పే చేయించుకొని, షన్ముఖ సాయి కుమార్ వద్ద ఉన్న 100 మద్యం బాటిల్స్ లో 50 వీరు ఐదుగురు తీసుకొని మిగిలిన 50 బాటిల్స్ ను షన్ముఖ సాయి కుమార్ కి ఇచ్చి అతనిని పంపినట్లు, అంతట నిన్న షన్ముఖ సాయి కుమార్ వద్ద తీసుకొన్న 50 బాటిల్స్ ని ఎవరికైనా అమ్మి మరల ఎక్కడయినా దారిలో ఎవరినైనా ఆపి వారివద్ద డబ్బులు వసూలు చేద్దామని వెళ్ళుచుండగా ఇంతలో పోలీసు వారు వచ్చి పట్టుకున్నారు అని చెప్పినారు._

_దానితో వారిని మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేయడం జరిగినది. ఈ కేసును ఎంతో చాకచక్యంగా ఛేదించిన సిబ్బందిని నందిగామ డీఎస్పీ నాగేశ్వర్ రెడ్డి గారు జగ్గయ్యపేట సీఐ చంద్రశేఖర్ గారు ప్రత్యేకంగా అభినందించారు_

Also read

Total Page Visits: 63 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed