SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

మదనపల్లిలో దారుణం.. గోడౌన్‌లో యువకుడి నిర్బంధం..

1 min read

చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో దారుణం చోటు చేసుకుంది. కార్తీక్ అనే దళిత యువకుడిని నాలుగు రోజులుగా నిర్బంధించారు. వివరాల్లోకెళితే.. మదనపల్లిలో ఉన్న సప్తగిరి షోరూమ్‌లో కర్తీక్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. అయితే, ఇటీవల కార్తిక్.. షోరూమ్ యాజమాన్యానికి తెలియకుండా బొలెరో వాహనాన్ని బయటకు తీసుకెళ్లాడు. అలా తీసుకెళ్లిన బొలెరో రోడ్డు ప్రమాదానికి గురవడంతో స్వల్పంగా దెబ్బ తిన్నది. ఈ విషయం తెలుసుకున్న షోరూమ్ మేనేజర్.. కార్తిక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అనుమతి లేకుండా వాహనాన్ని తీసుకెళ్లి యాక్సిడెంట్ చేశాడనే కారణంగా.. కార్తిక్‌ను షోరూమ్‌కు చెందిన ఓ గదిలో నిర్బంధించారు. దాదాపు నాలుగు రోజులగా షోరూమ్‌లోనే కార్తిక్‌ని నిర్బంధించాడు మేనేజర్. అయితే విషయం తెలుసుకున్న స్థానిక దళిత సంఘాల నేతలు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులతో కలిసి షోరూమ్ వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. కార్తిక్‌ను నిర్బంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Total Page Visits: 170 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed