SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ప్రేమ పెళ్లి.. ఇద్దరు పిల్లలు.. ఇంతలో…ఊహించని పరిణామాలు

1 min read

ప్రేమ వివాహం చేసుకున్న ఓ మహిళ జీవితంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. భర్త తాగొచ్చి వేధిస్తుండటంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె.. తన ఇద్దరు పిల్లలను రైలు కింద పడేసి, తానూ రైలు కిందకు దూకింది. ఈ ఘటనలో తల్లి, కూతురు మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన కొడుకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్లో ఆదివారం జరిగింది

Read also



వివరాల్లోకి వెళితే.. కమాన్పూర్ మండలం జూలపల్లికి చెందిన అరుణ(31), యైటింక్లయిన్ కు చెందిన జంగేటి ప్రవీణ్ లు ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వారికి కొడుకు సాత్విక్(5), సాత్విక (2) ఉన్నారు. కొంతకాలంగా ప్రవీణ్ మద్యానికి బానిసయ్యాడు. పుట్టింటికి వెళ్లి డబ్బులు తేవాలని అరుణను వేధిస్తున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అరుణ ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమైంది. తాను చనిపోతే పిల్లలను ఎవరూ చూసుకుంటారని అనుకుందో ఏమో పిల్లలతో కలిసి రామగుండం రైల్వే స్టేషన్కు వెళ్లింది.

దాణాపూర్ ఎక్స్ప్రెస్ రైలు వస్తుండగా ముందుగా పిల్లలను తోసింది. అనంతరం తానూ రైలు కింద పడింది. ఈ విషయాన్ని గమనించిన లోకో పైలట్ హారన్ మోగించి.. బ్రేక్ వేశాడు. అయినా వారిపై నుంచి రైలు కొద్ది దూరం దూసుకెళ్లింది. దీంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు.. వారిని రైలు కింద నుంచి తీశారు. అరుణ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్రగాయాలైన సాత్విక్, సాత్వికలను అధికారులు వెంటనే గోదావరిఖని ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. సాత్విక చికిత్స పొందుతూ మృతిచెందింది. సాత్విక్ పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో.. అతడిని మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై రామగుండం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడ చదవండి

Total Page Visits: 244 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed