SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ప్రాణ స్నేహితుడితో భార్య ఎఫైర్.. చివరకు!

1 min read

ప్రాణ స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణం తీసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కుప్పం మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. చిన్నరాజ్, అదే ప్రాంతానికి చెందిన గౌస్ పీర్ ఇద్దరూ ప్రాణ స్నేహితులు. ఇద్దరు కలిసే తిరిగేవారు. స్నేహం కారణంగా గౌస్ పీర్ తరచూ చిన్న రాజ్ ఇంటికి వస్తుండే వాడు. ఈ క్రమంలో చిన్న రాజ్ భార్యకు గౌస్ పీర్ కు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త. వివాహేతర సంబంధానికి దారి తీసింది.

కొన్నాళ్ల తర్వాత వీళ్లిద్దరు క్లోజ్ గా ఉండటాన్ని గమనించిన చిన్నరాజ్ ఇద్దరూ అన్నాచెల్లెళ్లుగా మెలుగుతున్నారని భావించాడు. మరోవైపు ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందంటూ స్థానికంగా పుకారు రేగింది. దీంతో నిప్పు లేనిదే పొగరాదు కదా అని వారి పై నిఘా పెట్టాడు. ఓ రోజు ఇద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో చిన్నరాజ్ ప్రత్యక్షంగా చూశాడు. దీంతో ఇద్దరిని మందలించాడు. తన ఇంటికి మరోసారి రావొద్దని గౌస్ పీర్ ను హెచ్చరించాడు. అయితే భర్త హెచ్చరికతో తీరు మార్చుకోవాల్సిన భార్య ప్రియుడిపై మోజు తగ్గించుకోలేక పోయింది. గౌస్ పీర్ ను ఏకాంతంగా కలిసేది.

దీంతో గౌస్ పీర్ పై పగ పెంచుకున్న చిన్నరాజ్ అతడిని అంతం చేయాలని ప్లాన్ వేశాడు. ఓ రోజు మందు పార్టీ ఇస్తున్నాను రావాలంటు కబురు పెట్టాడు. ఈనెల 3వ తేదీన ఇద్దరు కలిసి ఫుల్ గా తాగారు. ఈ క్రమంలో తన భార్యతో అక్రమ సంబంధం విషయాన్ని ప్రస్తావిస్తూ నిలదీశాడు. ఇద్దరి మధ్య మాటమాట పెరిగింది. దీంతో చిన్నరాజ్ కోపంతో రగిలిపోయాడు. బండరాయితో గౌస్ పీర్ తలపై మోది చంపేశాడు.

రెండురోజులుగా గౌస్ పీర్ కనిపించకపోవడంతో అతడి తల్లి షంషీద్ చిన్నరాజ్ ను నిలదీసింది. దీంతో అతడు ఇంటి నుంచి పరారయ్యాడు. దీంతో గౌస్ పీర్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు పలివిరివారి మిట్ట రైల్వే బ్రిడ్జ్ పక్కనే గౌస్ పీర్ మృతదేహాన్ని గుర్తించారు. పరారీలో ఉన్న హంతకుడిని అరెస్ట్ చేశారు.

Also read

Total Page Visits: 348 - Today Page Visits: 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed