SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

పెళ్లైన 7 రోజులకే నవ వధువు ఆత్మహత్య

1 min read

పెళ్లైన 7 రోజులకే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సామర్లకోట మండలం మేడపాడుకు చెందిన అశ్వినీ స్వాతి(19)కి కోరుకొండ మండలం గాదరాడకు చెందిన కనుమురెడ్డి అశోక్ తో గత నెల 29న వివాహం జరిగింది. 2 రోజుల కిందట వధూవరులు గాదరాడ వచ్చారు. ఆషాఢమాసం వస్తుండటం, సోమవారం మంచి రోజు కావడంతో.. సాయంత్రం తిరిగి వధువును పుట్టింటికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. అంతలోనే స్వాతి సోమవారం ఇంట్లో అందరూ ఉండగానే తన గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెకు అశోక్ మేనమామ వరస అవుతాడు.

ఆమె మృతి విషయం బయటకు రాకుండా ఇరు కుటుంబాల వారు రాజీ అయ్యారు. దగ్గర బంధువులే కావడంతో పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. బంధువుల్లో ఓ ఓ వ్యక్తి 100 కు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి మృతదేహానికి తహసీల్దారు సమక్షంలో పంచనామా నిర్వహించారు. ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వధువు మృతికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Total Page Visits: 72 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed