SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

పిల్లలకు ఉరేసి తాను ఆత్మహత్య

1 min read

అందరి ఆడపిల్లలలాగానే తన జీవితం ఉంటుందని ఆమె కలగంది. చిన్నప్పటి నుంచి మధ్య తరగతి కుటుంబంలో పెరిగిన ఆమె వివాహమయ్యాక తన జీవితం మారుతుందనుకుంది. తనకు ముగ్గురు కుమార్తెలు. భర్త తాగుడుకు బానిసై నిత్యం వేధింపులకు గురి చేసేవాడు. పని మానేసి జులాయిగా తిరగడం ప్రారంభించాడు. దీంతో ఇల్లు గడవని పరిస్థితి. తన పిల్లల కోసమైనా తాను బతకాలని ఇంట్లోనే చిన్న కిరాణం షాపు పెట్టుకొని నడుపుతుంది. ఆ డబ్బును కూడా తనకే ఇవ్వాలని భర్త వేధించాడు. ఇక తనకు చావే శరణ్యమని ఆమె భావించింది. తాను మరణిస్తే తన పిల్లల బతుకులు ఆగమైతాయని ఆమె ఆవేదన చెందింది. తనతో పాటు తన పిల్లలను కూడా చంపాలని నిర్ణయం తీసుకుంది. ముగ్గురు పిల్లలకు ఉరేసి తాను ఆత్మహత్యకు పాల్పడింది. అదృష్టవశాత్తు చిన్న కుమార్తె ప్రాణాలతో బయటపడింది. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ రాంనగర్ కు చెందిన తొర్పునూరి వెంకటేష్ కు చౌటుప్పల్ కే చెందిన ఉమారాణితో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు కూతుర్లు. హర్షిణి 12 ఏళ్లు, లాస్య 8 ఏళ్లు, షైనికి 8 ఏళ్లు. వెంకటేష్ వాటర్ సప్లై చేసే ఆటో పై పని చేసేవాడు. పెళ్లైన కొన్నాళ్ల వరకు బాగానే ఉన్న వెంకటేష్ ఆ తర్వాత మద్యానికి అలవాటు పడ్డాడు. తాగొచ్చి ఉమారాణిని వేధించేవాడు. పలుమార్లు దంపతుల మధ్య వివాదాలు కూడా జరిగాయి. పెద్ద మనుషులు వారికి నచ్చచెప్పి కలిసుండాలని చెప్పారు. వారి ముందు వెంకటేష్ మారుతానని మాటిచ్చిన ఆ తర్వాత యదావిధిగా తాగి వచ్చేవాడు.


లాక్ డౌన్ నుంచి పని కూడా మానేసిన వెంకటేష్ పూర్తిగా మద్యానికి బానిసయ్యాడు. వెంకటేష్ పని చేయకపోవడంతో ఇల్లు గడవడం ఇబ్బందిగా మారింది. దీంతో ఉమారాణి ఇంట్లోనే చిన్న కిరాణం షాపు పెట్టుకొని నిర్వహిస్తోంది. ఆ కిరాణం అమ్మగా వచ్చిన డబ్బులు కూడా తాగుడుకు ఇవ్వాలని వెంకటేష్ ఉమారాణితో గొడవ పడేవాడు. ఇవ్వడానికి నిరాకరిస్తే ఉమారాణిని కొట్టేవాడు. గత కొద్ది రోజులుగా ఆమెను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. ఆడపిల్లలున్నారని, ప్రవర్తన మార్చుకుంటే ఏదైనా పని చేసుకొని బతుకుదామని అనేక సార్లు ఉమారాణి భర్తకు నచ్చ చెప్పింది. కానీ అతనిలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఓ వైపు అప్పులు పెరగడం, మరో వైపు భర్తలో ఏ మాత్రం మార్పు రాకపోవడంతో ఉమారాణి తీవ్ర కలత చెందింది. ఇక తనకు చావే శరణ్యమని భావించింది. తాను మరణిస్తే తన పిల్లల భవిష్యత్ ఏంటని ఆలోచించింది. తనతో పాటే తన పిల్లలను కూడా తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకుంది.



బుధవారం రాత్రి వెంకటేష్ మద్యం తాగొచ్చి ఉమారాణితో మరోసారి గొడవ పెట్టుకున్నాడు. దీంతో మనస్థాపానికి గురైన ఉమారాణి ముందుగా తన పెద్ద కూతురు హర్షిణి, రెండో కూతురు లాస్యకు ముందుగా ఉరేసింది. వారు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత చిన్న కూతురు షైనికి ఉరేసి ఉమారాణి కూడా ఉరేసుకుంది. ఐతే షైనికి వేసిన ముడి జారడంతో ఆమె ప్రాణాలతో బయటపడగలిగింది. ఉదయం ఐనా ఇంటి తలుపు తీయకపోవడంతో చుట్టు పక్కల వారు అనుమానం వ్యక్తం చేశారు. పలువురు కలిసి కిటికిల ద్వారా లోపలికి చూడగా ఉమారాణి, ఇద్దరు కూతుళ్లు విగతజీవిగా పడి ఉన్నారు.

ఆ చిన్నారులను, ఉమారాణిని చూసి అంతా భోరున విలపించారు. చూడచక్కని రూపమున్న అమ్మాయిలు ఓ దుర్మార్గుని వల్ల విగతజీవులుగా మారారని అంతా అతనికి శాపనార్దాలు పెట్టారు. అందరితో కలివిడిగా ఉండే ఉమారాణి ఒక్కసారిగా ఇక లేదని తెలియడంతో ఆమె సన్నిహితులు, స్నేహితులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రతి ఒక్కరి చేత కన్నీరు పెట్టించింది. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమాయకుల చావుకు కారణమైన వెంకటేష్ ను ఉరి తీయాలని మహిళా సంఘాలు, పలు పార్టీల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Total Page Visits: 83 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed