SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణ ఘటన..వ్యక్తి దారుణ హత్య

1 min read

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వ్యవసాయ పనుల్లో పాల్గొన్న కూలీల మధ్య తలెత్తిన చిన్న వివాదం కొట్లాటకు దారితీసి ఒకరు హత్యకు గురయ్యారు. ఈనాడు కథనం ప్రకారం.. శంకర్ అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన నూతులపాటి పెద్దిరాజు, మరికొందరితో కలిసి పాతూరులో వరి నారు తీసే పనులకు వెళ్లారు. పని విషయమై శంకర్, పెద్దిరాజులకు మధ్య వివాదం జరిగింది. తోటి కూలీలు సర్దిచెప్పడంతో పని పూర్తయిన తర్వాత ఎవరి ఇళ్లకు వారు వచ్చేశారు.

సాయంత్రం పెద్దిరాజు, అతని కుటుంబ సభ్యులు మేరమ్మ, తరుణ్కుమార్, ఏసు, పౌలు, రమణ, కిరణ్ కుమార్, వెంకటేష్ లు శంకర్ ఇంటికెళ్లి లోపలి నుంచి బయటకు లాక్కొచ్చి కర్రలతో కొట్టారు. గాయపడిన అతన్ని భార్య బేబి 108 వాహనంలో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ చనిపోయారు. శంకర్ భార్య ఫిర్యాదు. మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ సుబ్బారావు, ఎస్ఐ భద్రరావు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు నమోదు చేశారు. మృతదేహానికి పరీక్ష చేయించి బంధువులకు అప్పగించారు. నిందితుడు పెద్దిరాజుతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

Also read

Total Page Visits: 99 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed