SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

దుకాణంలో రూ.10 లక్షల చోరీ వేలి ముద్రలు సేకరిస్తున్న క్లూస్‌ టీమ్‌

1 min read



చిలకలూరిపేట పట్టణం, గుర్తుతెలియని వ్యక్తులు పట్టణంలోని ఓ దుకాణంలో రూ.10 లక్షలు చోరీ చేశారు. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని కూరగాయల మార్కెట్‌ సమీపంలో ఉండే సాయిమణికంఠ రైస్‌మిల్లు యజమాని అర్వపల్లి కాశీవిశ్వేశ్వరావుకు మిల్లు ఎదురుగానే బియ్యం విక్రయించే దుకాణం ఉంది. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఇచ్చేందుకు శనివారం రాత్రి రూ.11.5 లక్షలు నగదు దుకాణంలోని బీరువాలో పెట్టి ఇంటికి వెళ్లాడు. ఆదివారం ఉదయం రైతులకు నగదు చెల్లించేందుకు దుకాణం తెరిచి చూడగా, బీరువా పగలగొట్టి ఉంది. అందులో రూ.10 లక్షలు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. మిగిలిన నగదు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని గుర్తించాడు. దుకాణం వెనుక గోడకు ఉన్న వెంటిలేటర్‌ చువ్వలను కోసి లోపలికి ప్రవేశించి నగదు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీఐ బిలాలుద్దీన్‌, ఎస్సైలు నరసదాసు, సుబ్బారావు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. గుంటూరు నుంచి వచ్చిన క్లూస్‌టీమ్‌ వేలి ముద్రలను సేకరించింది.

Total Page Visits: 76 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed