SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

తీవ్ర విషాదం నింపిన భార్య నిర్ణయం

1 min read

పని మీద భర్త బయటకు వెళ్లిన సమయంలో భార్య తీసుకున్న నిర్ణయం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆమె నిర్ణయంతో 11 ఏళ్ల పిల్లాడితో పాటు తన ప్రాణాలు పోయాయి. మేడ్చల్ లో జరిగిన ఈ హృదయవిదారక ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ బెంగాలకు చెందిన దీపక్, శాలిని దంపతులు. వీరికి 11 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. నాలుగు నెలల క్రితమే మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లికి దీపక్ దంపతులుకు ఉపాధి నిమిత్తం వచ్చారు.

Also read..



దీపక్ పలు ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిన సందర్భంలో రెండు లేదా మూడు రోజులకు ఓ సారి ఇంటికి వచ్చి భార్య, కొడుకును చూసుకునేవాడు. అయితే ఇటీవల దీపక్ కు వరంగల్ లో పని దొరకడంతో నాలుగు రోజుల క్రితం అక్కడి వెళ్లాడు. ఇంతలో ఏం జరిగిందో ఏమో కానీ దీపక్ వెళ్లిపోయిన తర్వాత శాలిని డేంజర్ డిసిషన్ తీసుకుంది.

తన కుమారుడితో కలిసి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. తొలుత తన 11 ఏళ్ల కుమారుడికి చీరతో ఉరేసి ప్రాణం తిసిoది. ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడింది. కాగా గదిలో నుండి దుర్వాసన రావడంతో ఇంటి యజమాని తలుపులు తట్టాడు. ఎంత సేపటికీ లోపలి నుండి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో తలుపులు బద్దలు కొట్టి వెళ్లి చూడగా భయానక దృశ్యం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రెండు రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సమాచారాన్ని చేరవేసి కేసు నమోదు చేసుకున్నారు.

Total Page Visits: 219 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed