SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

తీవ్ర మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

1 min read


చిత్తూరు : వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చిత్తూరు నగరం పాంచాలిపురంలో జరిగింది. రెండో పట్టణ సీఐ యుగంధర్‌ వివరాల మేరకు.. పాంచాలిపురానికి చెందిన గుణశేఖర్‌కు బంగారు పాళ్యం మండలం పెరుమాళ్లపల్లెకు చెందిన ఇందు(20)తో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. వీరికి ఏడు నెలల బాబు ఉన్నాడు. గుణశేఖర్‌కు పెయింటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా ఘర్షణ పడ్డారు. మనస్తాపం చెందిన ఇందు సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన కూతుర్ని కట్నం కోసం అల్లుడు వేధించేవాడని.. ఆ బాధ భరించలేకనే ఆత్మహత్య చేసుకుందని ఇందు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు

Total Page Visits: 77 - Today Page Visits: 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed