SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

తాడేపల్లి ఘటన మరువక ముందే.. గుంటూరులో మరో ఘోరం

1 min read

తాడేపల్లిలో యువతిపై సామూహిక అత్యాచార ఘటన నేటికీ కొలిక్కిరాలేదు. ఇంతలోనే మరో ఘోరం జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన కీచకుడు దివ్యాంగురిలపై నీచానికి పాల్పడ్డాడు.
తాడేపల్లిలో యువతిపై సామూహిక అత్యాచారం ఘటన మరువక ముందే మరో ఘోరం వెలుగుచూసింది. మతిస్థిమితం లేని మహిళపై దుర్మార్గుడు అత్యాచారానికి యత్నించిన అమానుష ఘటన చోటుచేసుకుంది. నరసరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండలం తుంగపాడుకి చెందిన దివ్యాంగురాలు పశువులు మేపుకునేందుకు పొలానికి వెళ్లింది. ఒంటరిగా ఉన్న ఆమెపై కన్నేసిన అదే గ్రామానికి చెందిన ఆలూరి శేషగిరిరావు నీచానికి ఒడిగట్టాడు. పశువులా ఆమెపై పడి అత్యాచారానికి తెగబడ్డాడు. ఇంటికి వచ్చిన బాధితురాలు నీరసంగా ఉండడం గమనించి కుటుంబ సభ్యులు ఆరా తీయడంతో దారుణం బయటపడింది. కనీస కనికరం లేకుండా మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారం చేసిన కీచకుడిపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also read

Total Page Visits: 15 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed