SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

తల్లితో కాపురం..కూతురిపై దారుణం

1 min read

తమిళనాడులో దారుణం వెలుగుచూసింది. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి ఆమె కూతురిపై కూడా అత్యాచారం చేశాడు. ఇందుకు సంబంధించి పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు… తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట తాలుకా దేవందవాక్కం గ్రామానికి చెందిన డ్రైవర్ చరణ్ రాజ్ (50) శ్రీపెరంబదూరులోని ప్రైవేటు కంపెనీలో బస్సు డ్రైవర్గా పని చేసేవాడు. అదే కంపెనీలో చరణ్జుతో పాటు సత్తరై గ్రామానికి చెందిన కుప్పుస్వామి క్లీనర్గా పనిచేసేవాడు. అయితే కుప్పుస్వామి భార్య కోమదితో చరణ్రాజుకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. మరోవైపు భర్తతో గొడవలు జరగడంతో కోమది ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తన 13 ఏళ్ల కూతురుని తీసుకుని వెళ్లి చరణ్ రాజ్ కలిసి జీవనం సాగించడం మొదలుపెట్టింది. చరణ్జ్, కోమది కలిసి పెద్దకుప్పంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే చరణ్జ్ కోమది కూతురిపై కన్నేశాడు.

Read also :



బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. దీంతో బాలిక భయపడి ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. అయితే నాలుగు నెలల కిందట బాలిక కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో.. ఆమె తల్లి ఆస్పత్రితకి తీసుకెళ్లింది. అక్కడ బాలికకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె గర్భవతి అని చెప్పారు. దీంతో కోమది షాక్ తింది. ఈ క్రమంలోనే బాలిక అసలు విషయం తల్లికి చెప్పి బోరుమంది. చరణ్జ్ తనపై అత్యాచారం చేసినట్టు చెప్పంది. ఇందుకు సంబంధించి బాలిక తల్లి కోమది.. నాలుగు నెలల కిందటే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పోక్సో చట్టం కింద చరణ్జైపై కేసు నమోదు చేశారు. అయితే తనపై కేసు నమోదు అయిందనే విషయం తెలుసుకున్న చరణ్ రాజ్ పరారీలో ఉన్నాడు. ఇక, కేసు విచారణలో భాగంగా చరణ్జు కోసం గాలించిన పోలీసులు.. అతడు తిరువణ్ణామలైలో ఉన్నట్లు గుర్తించి మంగళవారం అరెస్టు చేశారు. అనంతరం చరణ్రాజ్ను కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.

Total Page Visits: 331 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed