SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

అనంతపురం జిల్లా లో…క్షుద్ర పూజల’ ఘర్షణ

1 min read

అనంతపురం జిల్లా లో. క్షుద్ర పూజల’ ఘర్షణ

ఓబుళదేవరచెరువు : తమ కుటుంబానికి కీడు జరగాలన్న ఉద్ధేశంతో క్షుద్ర పూజలు చేయించారని ఆరోపిస్తూ ఓ కుటుంబంపై మరికొందరు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అనంతపురం జిల్లా ఓబుళదేవరచెరువు మండల పరిధిలోని చౌడంపల్లిలో బుధవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు… చౌడంపల్లి గ్రామానికి చెందిన లక్ష్మన్న కుమారుడు మునీంద్ర క్షుద్ర పూజలు చేశారనే నెపంతో అదే గ్రామానికి చెందిన రామాంజనేయులు బంధువులు వారితో ఘర్షణ పడ్డారు. మునీంద్ర, రామాంజినేయులు వర్గీయులు కట్టెలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో రామాంజనేయులు మద్దతుదారులు ప్రసాద్‌, రామాంజనేయులు, ప్రదీప్‌లు తీవ్రంగా గాయపడ్డారు. మునీంద్ర తండ్రి లక్ష్మన్న సైతం గాయపడ్డారు. ఒకరిపై ఒకరు విచక్షణా రహితంగా దాడులు చేసుకోవడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. గాయపడిన వారిని 108లో చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై ఎస్‌ఐ గోపి మాట్లాడుతూ గ్రామంలో ఎక్కడా క్షుద్ర పూజలు జరగలేదన్నారు. కేవలం వ్యక్తిగత కక్షలతోనే పరస్పర దాడులు జరిగాయని చెప్పారు. ఇరువర్గాలపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు

Also read.

Total Page Visits: 79 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed