SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

కన్నతల్లే కడతేర్చి, తానూ కాటికి చేరింది!

1 min read


*కుటుంబ కలహాలే కారణమా?*

*ముక్కు పచ్చలారని చిన్నారులకు ఇంత శాపమా?*

విశాఖ జిల్లా!అరకులోయ మండలం!


ఓ తల్లి తన ముగ్గురు పసి పిల్లలను కడతేర్చి, అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్న హృదయ విధారకర ఘటన, శుక్రవారం మండల కేంద్రంలోని పాత పోస్టాపీసు కాలనీలో చోటు చేసుకుంది.

మండలంలోని శిమిలిగూడ గ్రామానికి చెందిన సంజీవ్(38) సురేఖ(34) భార్య భర్తలు, వీరికి సుసన(10), సర్వీన్(8), సిరీల్(4) అనే ముగ్గురు బిడ్డలు ఉన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు వీరిద్దరి దాంపత్య జీవితంలో మనస్పర్థలు చోటు చేసుకోవడంతో గతకొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో ఉన్నట్లు తెలుస్తుంది.

భార్యాభర్తల మధ్య వాగ్వాదం అధికమవడంతో తీవ్ర మనస్తా పానికి గురైన సురేఖ తన భర్త ఇంట్లో లేని సమయంలో, తన ముగ్గురు పిల్లలకు విషపూరిత ఆహారం పెట్టి కడతేర్చగా, అనంతరం తానూ కూడా షీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుంది. మనసు కలిచివేసే ఈ ఘటనతో మండల కేంద్రంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి

విషయం తెలుసుకున్న అరకు శాసనసభ్యులు చెట్టి పాల్గుణ హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకొని, విగత జీవులుగా పడివున్న చిన్నారుల మృతదేహాలను చూసి, చలించి, కన్నీటి పర్యంతమ య్యారు. తదుపరి ఆయన పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకొని, మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు.

తన నియోజకవర్గ పరిధిలోని ప్రజలు ఏ సమ యంలోనైనా, ఎలాంటి కష్ట దుఃఖాల్లో ఉన్నా, మరుక్షణమే వారి ముంగిట నిలిచి వారికి అండగా ఉంటున్న ఎమ్మెల్యే చెట్టి పాల్గుణకి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

Also read

Total Page Visits: 90 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed