SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ఈ సామీ కి పెళ్లైన మహిళలే టార్గెట్.. ఏకంగా ఆరుగురితో.

1 min read

హైదరాబాద్ లో ఓ వ్యక్తి పెళ్లయి విడాకులు తీసుకున్న మహిళల్ని టార్గెట్ గా చేసుకుని అరాచకాలకు పాల్పడ్డాడు. భర్త నుంచి విడాకులు తీసుకున్న మహిళలు. భర్తకు దూరంగా ఉండే యువతుల్ని నమ్మించి.. వారి నుంచి అందినకాడికి దోచుకుంటాడు. ఇలా ఏకంగా ఆరుగురు మహిళల్ని పెళ్ళిళ్ల పేరుతో మోసం చేశాడు. అతనిపై ఇప్పటికే 12 కేసులు నమోదు కాగా.. తాజాగా మరోసారి పోలీసులకు చిక్కాడు.

వివరాల్లోకి వెళితే.. ఏపీలోని అనంతపురానికి చెందిన రంగస్వామి (32) ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చి లాలాగూడలో స్థిరపడ్డాడు. హైదరాబాద్ వచ్చిన కొద్దిరోజులకే అతడికి నీచమైన ఆలోచన వచ్చింది. కేవలం పెళ్లయిన మహిళలను టార్గెట్ చేయడం మొదలు పెట్టాడు. పరిచయం పేరుతో అమాయకంగా నటిస్తూ మహిళలను లోబరుచుకునేవాడు.మోజు తీరక ఒకరిని వదిలిపెట్టి మరో మహిళకు వల వేసేవాడు. ఇలా డబ్బుండి, భర్తలతో విడాకులు తీసుకున్న
మహిళలనే అతడు నమ్మించి మోసం చేసేవాడు.
లాలాగూడలో ఓ మహిళను ఇదే తరహాలో మోసం చేయడంతో ఆ మహిళ రంగసామిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా రంగసామి లీలలు బయటపడ్డాయి. రంగసామిపై గతంలో మహిళలపై అత్యాచారాలు, చైన్ స్నాచింగ్లు, దొమ్మీలు ఇలా 12 కేసులు నమోదయ్యాయి. ఓ కేసులో రెండేళ్లు జైలు శిక్ష కూడా అనుభవించాడు.

అంతే కాకుండా ఇతగాడు అమ్మాయిల్లా వేషాలు కూడా వేస్తాడు. అమ్మాయిల్లా ముస్తాబయ్యి, యువతులనే ట్రాప్ చేస్తాడు. ఇలా అనేక మందిని మోసం చేసి డబ్బులు కాజేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. తాజాగా ఓ మహిళతో గోవాకు వెళ్లాడు. అక్కడికి వెళ్లిన హైదరాబాద్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరుగురు మహిళలు పెళ్ళిళ్ల పేరుతో మోసం చేయడమే కాకుండా ఎన్నో కేసులున్న రంగసామిపై పోలీసులు ఎందుకు పీడీ యాక్ట్ నమోదు చేయడం లేదని మోసపోయిన మహిళలు వాపోతున్నారు. ఇటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Total Page Visits: 234 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed