SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ఆ చిన్న పొరపాటుతో అకౌంట్ లోని డబ్బులు మాయం

1 min read

ప్రభుత్వ ఉపాధ్యాయురాలికి సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించిన ఘటన తెలంగాణలోని ఆదిలాబాద్ లో చోటు చేసుకుంది. కాగజ్ నగర్ లో గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సన్ డైరెక్ట్ డీటీహెచ్ రీచార్జ్ చేసే క్రమంలో రెండు సార్లు రీచార్జ్ అయింది. దీంతో రీఫండ్ కోసం గూగూల్ లో సన్ డైరెక్ట్ కస్టమర్ కేర్ నెంబర్ ను సెర్చ్ చేయగా అందులో వచ్చిన ఓ నెంబర్ కు కాల్ కలిపింది. ఫోన్ లిఫ్ట్ చేసిన అవతలి వ్యక్తి మీకు సహాయం చేస్తానని హిందీలో మాట్లాడుతూ గుగూల్ పే, ఎనీ డెస్క్ యాప్ ఉందా లేదా అనే దానిపై ఆరా తీయగా గుగూల్ పే ఉందని, ఎనీ డెస్క్ యాప్ లేదని తెలిపింది. ఎనీ డెస్క్ యాప్ ఇన్ స్టాల్ చేసుకుని వివరాలు నమోదు చేయాలని సూచించాడు. గుగూల్ పేలో కట్ అయిన అమౌంట్, మీ సెల్ఫోన్ నంబర్ ఆఖరి అయిదు అంకెలు ఎంటర్ చేయాలని చెప్పడంతో ఆమె అలానే చేసింది. పలుమార్లు ప్రయత్నించినా డబ్బు రీఫండ్ కాలేదు. ఆ తర్వాత 15 నిమిషాల వ్యవధిలో ఆమె బ్యాంకు ఖాతా నుంచి ఐదుసార్లు మొత్తం రూ. 99,655 విత్ డ్రా అయినట్లు ఫోను మెసేజ్ రావడంతో బ్యాంక్ ను సంప్రదించింది. అప్పటికే జరగాల్సిన మోసం జరిగిపోయింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. కాగా గూగుల్ లో చూపించిన కస్టమర్ కేర్ నెంబర్ల ద్వారా ఆమె రీఫండ్ కోసం సంప్రదించడమే ఆమె చేసిన పొరపాటు.

Total Page Visits: 47 - Today Page Visits: 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed