SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

వేధింపులతోనే మహిళా పోలీసు ఆత్మహత్య

1 min read

నెల్లూరు జిల్లా ఉదయగిరి, : భర్త, అత్తమామల వేధింపులతోనే సీతారామపురం బిట్‌-2 సచివాలయంలో మహిళా పోలీసుగా పనిచేస్తున్న జ్యోతిశ్రీవిద్య ఆత్మహత్య చేసుకుందని సీఐ గిరిబాబు తెలిపారు. ఈ కేసులో నిందితుడైన ఆమె భర్త ప్రకాశరావును సోమవారం అరెస్టు చేశారు. వివరాలను గ్రామంలోని సర్కిల్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు… సీతారామపురం మండలంలోని అయ్యవారిపల్లి పంచాయతీ గౌతమ్‌నగర్‌కు చెందిన జ్యోతిశ్రీవిద్య సీతారామపురం బిట్‌-2 సచివాలయంలో మహిళా పోలీసుగా పనిచేస్తోంది. వింజమూరు మండలంలోని జువ్విగుంటపాలెం గ్రామానికి చెందిన ప్రకాశరావుతో ఈ ఏడాది ఆగస్టులో వివాహమైంది. ఆమెకు వచ్చే ఫోన్లు, వాట్సాప్‌ మేసేజ్‌లు భర్త చెక్‌ చేస్తూ అనుమానించి వేధిస్తున్నాడు. వివాహం జరిగి మూడు నెలలైనా గర్భం రాలేదని అత్తమామలు హింసిస్తున్నారు. ఈ విషయాలను అమ్మనాన్నలకు ఆమె ఎప్పటికప్పుడు చెబుతోంది. వేధింపులు భరించలేక ఈ నెల 2వ తేదీ పుట్టింట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసి వింజమూరు బంగ్లా కూడలిలో ప్రకాశరావును సీతారామపురం ఎస్సై కిషోర్‌బాబు, సిబ్బందితో కలిసి అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.

Also read

Total Page Visits: 73 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed