SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

బ్లాక్‌ గోల్డ్‌ ఆందోళనలు ఉధృతం చేస్తాం

1 min read

గాజువాక : ఆటోనగర్‌లోని బ్లాక్‌ గోల్డ్‌ కంపెనీ కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే ఈ నెల 20వ తేదీ నుంచి ఆందోళన ఉధృతం చేస్తామని సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఎం.జగ్గునాయుడు హెచ్చరించారు. సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యాన గాజువాకలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 23 సంవత్సరాలుగా 120 మంది కార్మికులు బ్లాక్‌ గోల్డ్‌ కంపెనీలో పనిచేస్తున్నారని తెలిపారు. యాజమాన్యం కార్మిక చట్టాలు అమలు చేయకుండా రోజుకు 12 గంటలు డ్యూటీ చేయించుకుందని తెలిపారు. అతి సాధారణంగా వ్యాపారం ప్రారంభించిన బ్లాక్‌ గోల్డ్‌ యాజమాన్యం కార్మికుల కష్టంతో రూ.వందల కోట్లు సంపాదించి జిల్లాలో వ్యాపారాలు విస్తరింప చేసుకుందన్నారు. కరోనాను షాకుగా చూపించి మే 3వ తేదీ నుంచి యాజమాన్యం కంపెనీని మూసివేయడంతో కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. యాజమాన్యం చర్యలను సిఐటియు తీవ్రంగా ఖండిస్తోందన్నారు. పరిశ్రమను వెంటనే తెరవాలని, లేకుంటే కార్మికులకు బకాయిలు చెల్లించాలని డిమాండ్‌చేశారు. ఈ నెల 19వ తేదీ కల్లా సమస్య పరిష్కరించకుంటే నగరంలోని బ్లాక్‌ గోల్డ్‌ యాజమాన్యం వ్యాపార సంస్థలన్నింటి వద్దా ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, లేబర్‌ కమిషనర్‌ వెంటనే జోక్యం చేసుకొని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు నగర కార్యదర్శి ఎస్‌.జ్యోతీశ్వరరావు, కార్మికులు ఈశ్వరరావు, మల్లేశ్వరరావు, అశోక్‌, ఇ.సత్యారావు పాల్గొన్నారు.

Also read

Total Page Visits: 123 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed