SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

బ్లడ్ బ్యాంకులలో నిండుకొంటున్న రక్తనిల్వలు

1 min read

*బ్లడ్ బ్యాంకులలో నిండుకొంటున్న రక్తనిల్వలు*

*రక్తదాతలకై ఎదురుచూపు*


ఒంగోలు: గత సంవత్సరం కరోనా వైరస్ వ్యాపించినప్పటి నుండి రోజురోజుకు బ్లడ్ బ్యాంకులలో రక్త నిల్వలు అడుగంటుచున్నాయి.

అసలే రక్తదానం చేయాలంటే ఎందరికో ఎన్నోభయాలు, వాటన్నింటినీ సమావేశాలు, కరపత్రాలు, వీడియోల ద్వారా తొలగిస్తూ… ఏదైనా సందర్భము వస్తే రక్తదాన శిబిరాలను ఏర్పాటుచేసి రక్తదానం చేసే వారిని చూసి మరోకరు రక్తదానం చేసేటట్లుగా ప్రోత్సహిస్తూ ప్రజలలో రక్తదానం పై ఉన్న భయాలను, అపోహలను తొలగించారు. ముఖ్యంగా సామాజిక సేవాసంస్థలు రెడ్ క్రాస్, వాసవి క్లబ్స్, ఆలిండియా మహాత్మా సోషల్ క్లబ్స్, లైన్స్ క్లబ్స్ మరియు చిరంజీవి అభిమాన సంఘాలు ప్రతి సంవత్సరం ఎక్కడొ ఒక చోట రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేసి రక్తదాతలను ప్రోత్సహిస్తున్నాయి. జిల్లాలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలలో రక్తదాన శిబిరాలు ఏర్పాటుతో ఎందరో యువకులు రక్తదాతలుగ మారారు.

కరోనా రాక తో ఇంతటి ప్రాముఖ్యమైన రక్తం కొరత ఇప్పుడు మన జిల్లాలో కూడా కనపడుచున్నది. సేవా సంస్థలు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయకపోవడం, కాలేజీల మూసివేత తో రక్తదానం ఇవ్వలేని యువకులు, కరోనా వాక్సిన్ వేయించుకొన్నవారు రెండు నెలల పాటు రక్తదానం చేయడానికి వీలు లేకపోవడం తో అత్యంత విరివిగా లభించే ఓ పాజిటివ్ రక్తం కూడా బ్లడ్ బ్యాంకులలో లభించడం లేదు.

ఒంగోలు నగరంలోని ప్రతిష్టాత్మక రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులోనే ఓ పాజిటివ్ బ్లడ్ స్టాక్ లేదని నోటీస్ బోర్డులో, వివిధ సామాజిక మాధ్యమాలలో పోస్ట్ పెట్టడం, మిగిన గ్రూప్ రక్తం, అరుదైన బాంబే బ్లడ్ గ్రూప్ లు ఆపదలో ఉన్నవారికి లభించడం మరింత జటిలమై పోతుంది.

కనుక రక్తదాతలకు మీ పరిధిలో మీరు స్వచ్ఛందముగా రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారికి రక్తం కొరత లేకుండా చేయాలని విజ్ఞప్తి.

Also read

Total Page Visits: 110 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed