SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

జలవివాదం రాజకీయలబ్ది కోసమే: బీజేపీ ఎంపీ జీవిఎల్.

1 min read


పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం ఆక్వా రంగం సభ్యులతో సమావేశమైన భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విలేకరులతో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జల వివాదం రాజకీయ అన్నారు. కోసమే

కొద్దిరోజులుగా తగాదా పెరగడం చూస్తుంటే రానున్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పని కష్టమని వివాదానికి తెర తీశారని విమర్శించారు. టిఆర్ఎస్ నాయకులు, మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు రాజకీయ కోసమే అన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయని, ప్రజల దృష్టిని మరల్చేందుకే కేంద్రంపై నింద మోపుతూ రాజకీయాలు చేశారని చెప్పారు. కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు వద్దని చెప్పినా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేయడంతో కేంద్రం వెంటనే స్పందించిందిదన్నారు. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ వెలువరించిన నోటిఫికేషన్ స్వాగతిస్తున్నామన్నారు. అపెక్స్ కౌన్సిల్ లో కేంద్ర మంత్రి తో కలిసి ఇరువురు ముఖ్య మంత్రులు సమన్వయంతో సమస్యలు పరిష్కరించుకోవాలని హితవు పలికారు.

నీటిపారుదల ప్రాజెక్టులు విషయంపై చర్చించేందుకు సోమవారం విజయవాడలో సమావేశం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు అన్నీంటినీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని,

పోలవరం ప్రాజెక్టును ప్రస్తావిస్తూ మిగతా ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ప్రాజెక్టులు పూర్తిచేయాలని బిజేపి డిమాండ్ చేస్తుందన్నారు.

Also read

Total Page Visits: 51 - Today Page Visits: 7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed