SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

అమానుషం: స్మశానంలో శిశువు ఏడుపులు.. అట్టపెట్టలో బాలుడిని చూసి కాటికాపరి షాక్..

1 min read



పిల్లోడి ఏడుపు ఓ అట్టపెట్టెలో నుండి వస్తుందని గమనించి తెరిచి చూశాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ నవజాత శిశువును కాటికాపరి గుర్తించాడు.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో దారుణం వెలుగు చూసింది. ఓ నెలల బిడ్డ.. శ్మశానంలో గుక్కపెట్టి ఏడుస్తున్నాడు.. ఇది విన్న కాటికాపరి దగ్గరకు వెళ్లి చూడగా, ఆ ఏడుపు ఓ అట్టపెట్టెలో నుండి వస్తుందని గమనించి తెరిచి చూశాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ నవజాత శిశువును కాటికాపరి గుర్తించాడు. వెంటనే స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శ్మశాన వాటికలో శనివారం అర్ధరాత్రి నవజాత శిశువును గుర్తు తెలియని వ్యక్తులు అట్టపెట్టెలో ఉంచి వెళ్లిపోయారు. పసిబిడ్డ ఏడుపును విన్న కాటికాపరి శివ అట్టపెట్టెలో ఉన్న మగశిశువును గుర్తించి, స్థానికులైన వెంకటేష్‌ దంపతులకు అప్పగించాడు. దీంతో వారు వెంటనే రాజమహేంద్రవరంలోని ప్రత్యేక చిన్న పిల్లల సంరక్షణ యూనిట్‌కు తీసుకెళ్లారు. శిశువు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే 108 నియోనాటల్‌ అంబులెన్సుకు సమాచారం అందించారు.

జీవిత భాగస్వామి ఎంపిక Promise Matrimony తోనే సాధ్యం
#కేవలం ₹499/- #అపరిమితం#
6 మాసాల వ్యవధి
దళారులతో పని లేదు!!ఎక్కువ ఖర్చు లేదు

You can add profiles in our App. Install App by

https://play.google.com/store/apps/details?id=com.promise.promisematrimony




హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్న 108 సిబ్బంది శిశువుకు అత్యవసర వైద్యాన్ని అందిస్తూ కాకినాడ ఎన్‌ఐసీయూ(నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌)కు తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, బరువు సుమారు 750 గ్రాములున్నట్లు ఐసీడీఎస్‌ పీడీ జీవీ సత్యవాణి తెలిపారు. బాబు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కాగా, ఇందుకు సంబంధించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించి అక్కడికి చేరుకున్న పోలీసులు అసలు తల్లిదండ్రుల కోసం ఆరా తీస్తున్నారు.

Also read

Total Page Visits: 74 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed