SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

సచివాలయాలు ఆకస్మిక తనిఖీ : సబ్ కలెక్టర్*

1 min read

*సచివాలయాలు ఆకస్మిక తనిఖీ : సబ్ కలెక్టర్*

*అనర్హుల జాబితా సచివాలయాల్లో ప్రదర్శించాలి*

*ప్రజలకు అందుబాటులో ఉండి పథకాలు అందించండి*

*సబ్ కలెక్టర్ భావన*

బొబ్బిలి, నవంబర్ 08 :- సచివాలయ సిబ్బంది ఉత్తమ సేవల ద్వారా గ్రామీణ ప్రజల అభిమానాన్ని పొందాలని తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావాలని సబ్ కలెక్టర్ భావన పేర్కొన్నారు. ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంతో మంచి ఆశయంతో ప్రవేశపెట్టిన ఈ సచివాలయ వ్యవస్థను విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలన్నారు. సబ్ కలెక్టర్ భావన సోమవారం బొబ్బిలి మండలం మునిసిపాలిటీ పరిధి లో గల వంతరం రోడ్, కంచరవీది వార్డు సచివాలయాలు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ నవరత్నాలలో భాగంగా ప్రభుత్వం అత్యంత ప్రాాన్యతనిస్తున్న పేదల గృహనిర్మాణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు, తదుపరి సచివాలయంలో ప్రజలకు అందిస్తున్న వివిధ సేవలపై ఆరా తీశారు. సచివాలయంలో నిర్వహిస్తున్న రికార్డులు తనిఖీ చేశారు, ప్రజలకు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అందిస్తున్న తీరును పరిశీలించారు. వలంటీర్లు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని హితవు పలికారు. అనర్హుల జాబితా సచివాలయాల్లో ప్రదర్శించాలని అలాగే ఓ.టి.ఎస్ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ పర్యటనలో బొబ్బిలి, మండలాల రెవెన్యూ అధికారి, మున్సిపల్.కమిషనర్, సిబ్బంది, సచివాలయాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Also read

పిడియస్ లారీలను ఆపి కొంతమంది విలేకరులు డబ్బులు డిమాండ్..డిఎస్పీ శ్రీనాధ్

Total Page Visits: 114 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed