SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

విశాఖ శారదాపీఠానికి ఆస్తులు ముఖ్యం కాదు

1 min read

**

– అద్వైత వేదాంతమే పీఠం ఆస్తి
– స్వామి స్వరూపానందేంద్ర
– చాతుర్మాస్య దీక్షకు శ్రీకారం


విశాఖ శ్రీ శారదాపీఠానికి ఆస్తులు ముఖ్యం కాదన్నారు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి. అద్వైత వేదాంతమే పీఠానికి ఏకైక ఆస్తి అని స్పష్టం చేశారు. ఋషికేష్ వేదికగా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర శనివారం చాతుర్మాస్య దీక్షను చేపట్టారు. గురు పూర్ణిమ సందర్భంగా వ్యాస పూజతో దీక్షకు అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ పీఠమంటే అర్చనలు, పూజలు కాదన్నారు. పీఠమంటే అధ్యయనం, అధ్యాపనమని స్పష్టం చేసారు. అద్వైత తత్వాన్ని ప్రబోధిస్తూ, శంకర భాష్యాన్ని ప్రవచిస్తున్న విశాఖ శారదాపీఠం విద్యాపీఠంగా వెలుగొందుతోందని తెలిపారు. సనాతన హైందవ ధర్మాన్ని కించపరిచిన వారిపై 30 సంవత్సరాలుగా తమ పీఠం పోరాడుతూనే ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మత మార్పిడులపై ధర్మ పోరాటం సాగించిన ఏకైక పీఠం విశాఖ శారదాపీఠమని స్పష్టం చేశారు. అద్భుతమైన గురు సాంప్రదాయం విశాఖ శ్రీ శారదాపీఠం సొంతమని స్వరూపానందేంద్ర వివరించారు. తమ పీఠానికి గురుస్థానం కర్నాటకలోని హోళె నర్సిపూర్ అని తెలిపారు. మహా తపస్సంపన్నులైన బోధానందేంద్ర సరస్వతీ స్వామి విశాఖ శారదా పీఠానికి పరమేష్టి గురువులని వివరించారు. వేదాలు, ఉపనిషత్తుల సారాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని అనుభవ రూపకంగా తెలిపిన సన్యాస చక్రవర్తిగా ఆదిశంకరాచార్యుల వారిని కీర్తించారు. ఆది శంకరులు అవతరించకపోతే భారతదేశంలో సనాతన హైందవ ధర్మం ఉండేదే కాదని స్పష్టం చేశారు. స్వాత్మానందేంద్ర స్వామి మాట్లాడుతూ మానసిక శుద్ధికోసం గురువుల్ని ఆరాధించడం ఒక్కటే మార్గమని తెలిపారు. గురువులను ఆశ్రయించి, సేవలు చేసి, విద్యను అభ్యసించే వారికి ఇహలోకంలో స్వర్గం, పరలోకంలో భగవంతుని సాన్నిధ్యం దొరుకుతుందన్నారు. గంగాతీరంలో ప్రస్థానత్రయం, శుద్ధశాంకర తత్వం, శంకర భాష్యాన్ని వింటూ చాతర్మాస్య దీక్షలు చేపట్టడం పూర్వజన్మ సుకృతమేనని స్పష్టం చేశారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్రులకు ఇది 25వ చాతుర్మాస్య దీక్ష గా తెలిపారు. తెలుగు ప్రజలకు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి అనుగ్రహం, శ్రీ శారదా స్వరూప రాజశ్యామల, చంద్రమౌళీశ్వరుల ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని దీక్షాకాలంలో ప్రార్ధిస్తానన్నారు

*శాస్త్రోక్తంగా చాతుర్మాస్య దీక్షకు అంకురార్పణ*
సనాతన హైందవ ధర్మంలో అత్యంత ప్రాచుర్యం పొందిన చాతుర్మాస్య దీక్షలకు విశాఖ శ్రీ శారదాపీఠం శ్రీకారం చుట్టింది. ఋుషికేష్ లోని పీఠం ఆశ్రమంలో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ఈ దీక్షలను చేపట్టారు. సెప్టెంబర్ 20వ తేదీ వరకు చాతుర్మాస్య దీక్ష కొనసాగుతుంది. ఉదయం గంగానదీ తీరంలో గంగమ్మ తల్లికి పూజలు చేశారు. ఆ తర్వాత గోమాతను పూజించారు. పూర్ణాహుతి అనంతరం వ్యాస పూజ నిర్వహించారు. ఈ పూజలో శ్రీకృష్ణుడు, వ్యాసుడు, దక్షిణామూర్తి సహా 45 మంది గురువులను ఆరాధిస్తూ అర్చన చేశారు. సకల మానవాళికి శుభం కలగాలని విశాఖ శ్రీ శారదాపీఠం ఏటా చాతుర్మాస దీక్షలను చేపడుతోంది

Also read

Total Page Visits: 200 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed