SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

సామాజిక సేవలోనూ వాట్సాప్ గ్రూపులు సహకరించాలి గ్రేటర్ విశాఖ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి

1 min read

విశాఖపట్నం

కరోనా కష్టకాలంలో వాట్సాప్ గ్రూపులు చాలా ఉపయుక్తంగా ఉన్నాయని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గొలగాని వెంకట హరి కుమారి అన్నారు. శుక్రవారం సాయంత్రం గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ మేయర్ ఛాంబర్ లో ఆనందో బ్రహ్మ లాఫింగ్ క్లబ్ వాట్సాప్ గ్రూప్ లోగో ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సొంత మనుషులును కూడా కలుసుకోలేని కరోన పరిస్థితులలో వాట్సాప్ గ్రూపు ద్వారా ఏకకాలంలో అందరినీ పలకరించు కోవచ్చని అన్నారు. ఇలాంటి వాట్సాప్ గ్రూపుల ద్వారా స్నేహ బంధాలు పెనవేసుకోవడమే కాకుండా, ఇలాంటి గ్రూపులు విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచాలని సూచించారు. యాంత్రికమైన జీవితంలో నవ్వుకి నోచుకోలేని పరిస్థితులలో హాస్యానికి పెద్దపీట వేస్తూ ఆనందోబ్రహ్మ లాఫింగ్ క్లబ్ ఏర్పాటు కావడం అభినందించదగ్గ విషయమని ఆమె కొనియాడారు. గ్రూప్ అడ్మిన్, సామాజికవేత్త డా.గణగళ్ళ విజయ్ కుమార్ ప్రయత్నాన్ని ఆమె కొనియాడరు. సేవా దృక్పథంతో ఇలాంటి గ్రూపులు పయనించాలని పేర్కొన్నారు. లాఫింగ్ క్లబ్ గ్రూప్ అడ్మిన్ డా.గణగళ్ళ విజయ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ 8 రాష్ట్రాలలోని తెలుగు ప్రతిభావంతులైన 180 మందికి పైగా వివిధ రంగాలకు చెందిన వారితో ఈ గ్రూపు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ గ్రూపు ద్వారా వినోదమే కాకుండా సామాజిక సేవ చేయటంలోనూ సభ్యులు ముందుంటారని వివరించారు. రక్తదానం, నిరుపేద వర్గాలకు ఆర్థిక, మౌలిక వసతుల కల్పన ఈ గ్రూపు ద్వారా పెద్ద ఎత్తున చేయనున్నామని పేర్కొన్నారు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో అనేక గ్రామాలలో సేవా కార్యక్రమాలను విస్తరించ నున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో జై శ్రీ విశాఖ కళాకారుల సంఘం అధ్యక్షులు కరెడ్ల అప్పలరాజు, సహా గ్రూప్ అడ్మినులు అర్చన,నమిత,
మహేశ్వరి,సజాత,మమత, ప్రసన్నకుమార్,వెంటేష్,బుల్లి, మిమిక్రీ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Also read

Total Page Visits: 105 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed