SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

సామాజిక ఉద్యమాలే శేషగిరికి ఘన నివాళి

1 min read



బొబ్బిలి


సమాజ అభివృద్ధి కోసం చేసిన సామాజిక ఉద్యమాలే శేషగిరికు ఘనమైన నివాళులని పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఐ. వెంకటేశ్వరరావు అన్నారు. శ్రీషిరిడిసాయి డిగ్రీ కళాశాలలో శనివారం ఇటీవల కరోనాతో మరణించిన యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొరెడ్ల శేషగిరి సంస్మరణ సభ జరిగింది. శేషగిరి చిత్రపటానికి ఐవి, తల్లి సూర్యకాంతం, యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు కె.విజయగౌరి, ప్రసన్నకుమార్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రౌతు రామమూర్తి, కారుణ్య ఫౌండేషన్ చైర్మన్ జేసీ రాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కంటికి కనిపించని కరోనా సూక్ష్మ జీవి శేషగిరిను పొట్టనపెట్టుకోవడం విచారకరమన్నారు. కరోనాతో ఎందరో మహానుభావులు, ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో పరిస్థితులకు అనుగుణంగా రాజీపడకుండా ఉద్యమబాట పట్టారన్నారు. నిరంతర అధ్యయణశాలి శేషగిరి మాస్టర్ అన్నారు. వర్గ పోరాట లక్ష్యాన్ని ఎంచుకుని ఉద్యమ బాట పట్టారన్నారు. అన్యాయంపై పోరాటం చేసి విద్యా రంగ పరిరక్షణకు పని చేశారన్నారు. దోపిడీ వర్గాలకు అనుకూలంగా నేడు తరగతి గదులలో పాఠాలు బోధించడం విచారకరమన్నారు. సామాజిక స్పృహను పెంపొందించేలా పాఠ్యపుస్తకాలలో పొందుపరచాలని కోరారు. సామాజిక బాధ్యతతో పని చేసి సమాజ రుణం తీర్చుకోవాలని ఉపాధ్యాయులను కోరారు. దేశం, రాష్ట్రంలో పాలిస్తున్న పాలకులు సామాజిక బాధ్యతతో పని చేయడం లేదని విమర్శించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. పార్లమెంటులో బీజేపీ చేసిన ప్రజా వ్యతిరేక చట్టాలకు వైసీపీ, టీడీపీ ఎంపీలు ఓటువేసి మద్దతు ఇవ్వడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. నూతన జాతీయ విద్యా విధానంతో ప్రభుత్వ విద్యా రంగానికి నష్టమన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని కోరితే చేసిన వైసీపీ ప్రభుత్వం ఉక్కు పరిరక్షణకు ఎందుకు కార్మికులకు అండగా పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. తెలుగు మీడియంను ఎత్తివేసి ఇంగ్లీషు మీడియం అమలు చేస్తామనడం దుర్మార్గమన్నారు. విద్యా వ్యవస్థలో వివక్షత చూపడం సరి కాదన్నారు. శాస్త్రీయ దృక్పథంతో పని చేయాలన్నారు. నాడు-నేడు పథకంతో నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం మంచిపరిమానం అయినప్పటికీ నూతన విద్యా విధానం అమలు చేసి పేదలకు విద్యా అందకుండా ప్రభుత్వం పని చేయడం అన్యాయమన్నారు. నూతన విద్యా విధానంతో ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలు మూత పడతాయన్నారు. ప్రభుత్వ విద్యారంగం బలోపేతానికి ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఓటుతోనే పాలకులకు బుద్ది చెప్పాలన్నారు. విద్యా రంగంలో ఖాళీగా ఉన్న 26వేల పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదిశగా పని చేయడం లేదన్నారు. యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు కె.విజయగౌరి మాట్లాడుతూ శేషగిరి స్పూర్తితో ఉద్యమం చేయాలన్నారు. జీవో172ను రద్దు చేసి విద్యా రంగాన్ని కాపాడాలని కోరారు. ప్రపంచ బ్యాంకు ఒప్పందాలలో భాగమే నూతన విద్యా విధానం అన్నారు. ప్రజలను చైతన్యం చేసి పోరాటం చేయాలన్నారు. కారుణ్య ఫౌండేషన్ చైర్మన్ జేసీ రాజు మాట్లాడుతూ ప్రజలు, ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలపై పని చేసే శేషగిరి మరణం సమాజికి నష్టమన్నారు. అన్యాయంపై ప్రశ్నించడమే లక్ష్యంతో పని చేశారన్నారు. యుటిఎఫ్ జిల్లా నాయకులు వి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా రంగం బలోపేతానికి పని చేశారన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పని చేశారన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి రౌతు రామమూర్తి మాట్లాడుతూ ప్రజలు, విద్యార్థులకు నష్టం చేసే చట్టాలను ఐక్యంగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. శేషగిరి మరణం ఉద్యమాలకు తీరని నష్టమన్నారు. విద్యారంగ, ఉపాధ్యాయ, ప్రజా పోరాటాలే శేషగిరికి నిజమైన నివాళులని వక్తలు అన్నారు. కార్యక్రమంలో పి ఆర్ టియు జిల్లా అధ్యక్షులు వి.తవిటినాయుడు, ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి పి.ధనుంజయ, సీఐటీయూ నాయకులు పి.శంకరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Read also



స్మారక భవనం నిర్మాణానికి సహకరించాలి

యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొరెడ్ల శేషగిరి పేరును విజయనగరంలో నిర్మించనున్న స్మారక భవనం నిర్మాణానికి సహకరించాలని నాయకులు కె.విజయగౌరి, వి.ప్రసన్నకుమార్ కోరారు. భవనం నిర్మాణానికి ఆర్థికంగా సహకరించాలని పిలుపునిచ్చారు. కారుణ్య ఫౌండేషన్ చైర్మన్ జేసీ రాజు రూ.25వేలు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రౌతు రామమూర్తి రూ.25వేలు, యుటిఎఫ్ నాయకులు జి.వెంకటనాయుడు రూ.10వేలు ప్రకటించారు.

Total Page Visits: 131 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed