SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

విత్తనం నుంచి పంట అమ్మకం వరకు రైతులను చేయి పట్టి నడిపిస్తున్నాం..

1 min read

*విత్తనం నుంచి పంట అమ్మకం వరకు రైతులను చేయి పట్టి నడిపిస్తున్నాం..*

*: తమది రైతుల పక్షపాత ప్రభుత్వం.. రైతుల కోసం గత రెండేళ్లలో 83,670 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం..*

*: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి*

అనంతపురం, జూలై 08 :

*విత్తనం నుంచి పంట అమ్మకం వరకు అన్ని దశలలోనూ రైతులను చేయి పట్టి నడిపిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.*

*అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని మల్కాపూర్ రోడ్ లో ఉన్న విద్యార్థి స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు.*

*ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈరోజు నాన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజు అని, ఆయన బతికి ఉన్నంతకాలం రైతుల గురించి ఆలోచన చేసి రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పి మనసా వాచా కర్మణా అడుగులు వేసిన దివంగత నేత పుట్టిన రోజును సరే దినోత్సవంగా రాష్ట్రవ్యాప్తంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత పాలకులు విద్యుత్ వైర్లపై బట్టలు ఆరవేసుకునేలా చేసినా వైయస్సార్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఉచిత విద్యుత్ పై సంతకం పెట్టి విప్లవానికి నాంది పలికారని సగర్వంగా తెలియజేస్తున్నామన్నారు. ఉచిత విద్యుత్, ఇన్పుట్ సబ్సిడీ పెంపు, విత్తనాల ధర తగ్గింపు, విద్యుత్ బకాయిల రద్దు, జలయజ్ఞంతో రాష్ట్రం రూపురేఖలనే కాక జిల్లా రూపురేఖలను కూడా మార్చేసిన వ్యక్తి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. దివంగత నేత వైయస్ ఆర్ ని స్ఫూర్తిగా తీసుకొని గడిచిన రెండేళ్లలో కూడా తమ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా కొనసాగిందన్నారు.*

*తమ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వంగా రైతుల కోసం గత రెండేళ్లలో 8,670 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. ఈరోజు 1,570 కోట్ల రూపాయల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నామన్నారు. ఏడాదిన్నరగా కోవిడ్ కారణంగా రాష్ట్రమంతా అతలాకుతలం అవుతున్న సమయంలో రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు, రెవిన్యూ కూడా పెను సవాళ్లుగా మారిన పరిస్థితులు ఉన్నా కూడా ఎక్కడ మీ బిడ్డ రాజీపడలేదన్నారు. ప్రభుత్వానికి ఉన్న కష్టాలకన్నా రైతులకు, అక్క చెల్లెమ్మలకు, పేదవాడికి ఉన్న కష్టాలు ఎక్కువ అని వారికి మంచి చేయడమే న్యాయం అని చెప్పి రాజీ పడకుండా ఆదుకున్నామన్నారు. గ్రామ స్థాయిలోనే మార్పులు తీసుకువచ్చి రైతుల గురించి ఆలోచన చేసింది ఎప్పుడు జరగలేదన్నారు. 3,648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో రైతుల కష్టాలను నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను అని చెప్పి ఈ రెండేళ్లలో వాటన్నిటినీ నిజం చేసి చూపించామన్నారు. రైతులను ఆదుకునేందుకు ఎన్నికలలో చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తూ వస్తున్నామన్నారు. రైతులు పంట వేసేటప్పుడు పెట్టుబడి వల్ల, పెట్టుబడి ఖర్చులు తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు రైతులకు కష్టం వస్తుందని, పెట్టుబడి ఖర్చులు పెరుగుతూ పోతుంటే రైతులకు ఆదాయం కనిపించని పరిస్థితులు ఉంటాయని, పంట పండించిన తర్వాత దాన్ని అమ్ముకోలేక రైతులు కష్టపడతారని తాను పాదయాత్రలో చూశానన్నారు. రైతులు వ్యవసాయంపై ఆధార పడతారని వారికి అదనపు ఆదాయం చూపించాలని ప్రభుత్వం భావించింది. అకాల వర్షాల వల్ల పంట నష్టపోతే, బ్యాంకులు, ప్రభుత్వాలు ఆదుకోలేని పరిస్థితిలో ఉంటే ఆ రైతు తల్లడిల్లిపోయే పరిస్థితి తాను కళ్లారా చూశానని, ఇలాంటి నాలుగు సమస్యలకు సమాధానం వెతుకుతూ తాము అధికారంలోకి వచ్చిన మొట్ట మొదటి రోజు నుంచి అడుగులు వేశామన్నారు. ఇందులో భాగంగా రైతున్నలను ఆదుకునేందుకు జూన్ మాసం లోనే పెట్టుబడి సాయం అందించేలా ఎప్పుడూ ఎక్కడా జరగని విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి రైతన్నకు కూడా రైతు భరోసా కింద నేరుగా 13,500 రూపాయలు ఇచ్చి రైతుల పెట్టుబడి ఖర్చు తగ్గించడం చేశామన్నారు. రైతు భరోసా పథకం కింద రెండేళ్లలో 52,38,000 మంది రైతన్నలకు 17,029 కోట్ల రూపాయలను నేరుగా ఇచ్చామన్నారు.*

*ప్రతి గ్రామంలోనూ కూడా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ రైతు భరోసా కేంద్రాలలో విత్తనం నుంచి అమ్మకం వరకు ప్రతి సందర్భంలోనూ రైతుల చేయి పట్టుకుని సహాయ సహకారాలు అందిస్తూ తోడుగా ఉంటున్నామన్నారు. ఆర్బికేల ద్వారా నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరా అవుతున్నాయని, రైతులను ఎవరు మోసం చేసే పరిస్థితి రాకూడదని, ఎవరూ కూడా నకిలీ విత్తనాలు, ఎరువులు రైతులకు సరఫరా చేసే పరిస్థితి రాకూడదని నేరుగా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, మందులు రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తున్నామన్నారు. ఆర్బికెల ద్వారా మీ ఊరులోనే, మీ ఇంటి దగ్గరే, మీరు బటన్ నొక్కిన వెంటనే 48 గంటల్లోగా అన్నీ రైతుల దగ్గరికి వచ్చేలా ఏర్పాటు చేశామన్నారు. అనంతపురం జిల్లాలో ఈ ఏడాది 2.30 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను మీ గ్రామంలోనే ఎంతో సులభంగా మీ ఇంటి వద్దకే అందించామన్నారు. గతంలో విత్తనాల కోసం మండల కేంద్రాలకు వెళ్లి రోజుల తరబడి ఎదురు చూసే పరిస్థితి నుంచి మీ ఇంటి వద్ద మీ గ్రామంలోనే నాణ్యతతో విత్తనాలు అందించే ఏర్పాటు చేశామన్నారు. ఆర్బికెల ద్వారా ఈ క్రాప్ చేయిస్తున్నామని, ప్రతి రైతు ఎన్ని ఎకరాలలో ఏ పంట వేశారు అనేది మీ గ్రామంలోనే రిజిస్ట్రేషన్ జరుగుతోందన్నారు. రిజిస్ట్రేషన్ తర్వాత ఫిజికల్ అక్నాలెడ్జ్మెంట్ కింద స్లిప్పులు కూడా ఇచ్చే ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ క్రాప్ ద్వారా రైతులకు ఏ కష్టం వచ్చినా ఆర్బికేల ద్వారా పంటల బీమా, వడ్డీలేని రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ, పంట కొనుగోలు కూడా జరుగుతున్నాయన్నారు. ఆర్బి కే స్థాయిలో గ్రామాల్లో, మండలాల్లో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా రైతులతో కూడిన వ్యవసాయ బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. ఏ పంట వేయాలి, ఏ విత్తనం వేయకూడదు, ఏ పంట వేస్తే నష్టం వస్తుంది అనే విషయంలో కూడా క్రాప్ ప్లానింగ్ చేస్తూ ఏ పంట వేయాలి, ఏ పంట వేస్తే బాగుంటుంది, ఏ పంట వేస్తే ఏమేం లాభాలు వస్తాయి చెబుతూ సూచనలు, సలహాలు ఇచ్చే అగ్రికల్చర్ బోర్డులను ఆర్బి కే స్థాయిలో ఏర్పాటు చేశామన్నారు. ఆర్బి కే స్థాయిలోనే కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ ను క్రియేట్ చేసి అక్కడే తక్కువ ధరకే పనిముట్లను అద్దెకు ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ప్రతి అడుగులోనూ రైతులకు అండగా, తోడుగా ఆర్బికెలు ఉన్నాయన్నారు. ఆర్బికేలో రైతు పంట నమ్ముకోలేని పరిస్థితిలో గిట్టుబాటు ధర కల్పించేందుకు కోసం సీఎం యాప్ ద్వారా పంటను కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతోందన్నారు.*

*రైతుల కోసం రెండేళ్లలో వరికి సంబంధించిన, ధాన్యానికి సంబంధించిన కొనుగోలు పక్కన పెట్టి, 1800 పత్తికి సంబంధించిన కొనుగోళ్లను పక్కనబెట్టి, కేవలం ఇతర పంటలైన కంది, బొప్పాయి, అరటి, చీని, వేరుశెనగ, పొగాకు పంటకు అక్షరాల 6,600 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతులకు తోడుగా నిలవగలిగామన్నారు. రైతుల ఆదాయం పెంచేందుకు చేయూత, ఆసరా పథకాలు తీసుకువచ్చామని, పశువుల కొనుగోలును ప్రోత్సహించామని, అమూల్ లాంటి సంస్థలు తీసుకువచ్చామని, పాలను 5 నుంచి 15 రూపాయల రేటు పెంచి కొనుగోలు చేసేలా కార్యాచరణ చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు వేల చోట్ల ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని, రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లోకి చొచ్చుకొనిపోయి పాల విప్లవం తీసుకొస్తామన్నారు. రైతన్నలు పంట నష్టపోతే వారిని ఆదుకునేందుకు క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకువచ్చామని, ఖరీఫ్ లో పంట నష్టపోతే వచ్చే ఖరీఫ్ నాటికి క్రాఫ్ ఇన్సూరెన్స్ వచ్చే ఏర్పాట్లు చేశామన్నారు. అకాల వర్షం, కరువు వచ్చినా రైతులు ఇబ్బంది పడకుండా ఇన్పుట్ సబ్సిడీ అందిస్తున్నామన్నారు.ఆక్వా రైతులకు సైతం యూనిట్ కు ఒకటిన్నర రూపాయికే విద్యుత్ అందిస్తున్నామన్నారు.*

*నేరుగా ప్రజలకు లబ్ధి కల్పిస్తున్నారని,అభివృద్ధి చేయడం లేదని నేనంటే గిట్టని వారు ఆరోపిస్తున్నారన్నారు.నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో లభించే ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రభుత్వ పాఠశాలలకు సైతం అందించేందుకు,అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ సి సిలబస్ ను ప్రవేశ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను ఏర్పాటు చేసి అవినీతి రహితంగా సేవలు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాలు అన్నింటిని తనకు ఓటు వేయని వారికి సైతం అందిస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ ద్వారా 90 రకాల మందులు అందిస్తూ,వైద్య సిబ్బంది 24 గంటల పాటు అక్కడే నివాసం ఉండి సేవలు అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. అంగన్వాడీ కేంద్రాలనుప్రీ ప్రైమరీ పాఠశాలలుగా మార్పు చేశామన్నారు. ఇంటర్నెట్ ఏర్పాటు చేసి డిజిటల్ లైబ్రరీ లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇవన్నీ అభివృద్ధికి చిహ్నాలుగా ఆయన పేర్కొన్నారు. రెండు సంవత్సరాల కాలంలో 83,600 కోట్ల రూపాయల పై చిలుకు ఖర్చు చేశామన్నారు. కళ్యాణదుర్గం,రాయదుర్గంలకు లబ్ధి చేకూరేలా బీటీపీ ప్రాజెక్టుకు సంబంధించి భూ సేకరణ కార్యక్రమం జరుగుతోందని ,1400 ఎకరాల భూసేకరణకు గాను 500 ఎకరాలు సేకరించారని, మిగిలిన వాటిని 60 రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, జేసీలకు ఆదేశిస్తున్నామన్నారు. యుద్ధప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని పూర్తిచేసి ఈ ప్రాంతానికి నీరు అందిస్తామన్నారు. 36 వ ప్యాకేజీ పనులను మూడు,నాలుగు వారాల్లో జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆంజనేయస్వామి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిరమించేందుకు విప్ ప్రస్తావించగా, వాటిని కూడా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 39 గ్రామాలకు తాగునీరు అందించే కార్యక్రమాన్ని కూడా త్వరలోనే ఈ ప్రాంత ప్రజలకు శుభవార్త అందిస్తానన్నారు .రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని మంత్రులు,ప్రజా ప్రతినిధులు సన్మానించారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కి నాగలిని బహూకరించారు.*

కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కురసాల కన్నబాబు, రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖా మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ, రాష్ట్ర పశుసంవర్ధక పాడి మరియు మత్స్యశాఖ మంత్రి సిదిరి అప్పలరాజు, జిల్లా ఇంచార్జ్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం,అనంతపురము, హిందూపురం ఎంపీలు, ఎమ్మెల్సీలు, అనంతపురము,గుంతకల్, తాడిపత్రి, కదిరి, కళ్యాణదుర్గం, రాప్తాడు, మడకశిర, ఎమ్మెల్యేలు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, రైతులు, ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.
– – – – – – – – – – – – – – – – – – – – – – – –
సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, అనంతపురం వారిచే జారీ.

Read also:

Total Page Visits: 53 - Today Page Visits: 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed