SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

విజయవాడ లో అనధికార కట్టడాలకు వైసీపీ నేతల వత్తాసు

1 min read

అనధికార కట్టడాలకు వైసీపీ నేతల వత్తాసు
భవన యజమానుల నుంచి భారీగా వసూళ్లు
ప్రాంతాన్ని బట్టి రూ.లక్ష నుంచి 50 లక్షలు
వీఎంసీ సిబ్బందీ వారి మాట వినాల్సిందే
వినకుంటే సిబ్బందిపై భౌతిక దాడులు

విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో అనధికార కట్టడాలను నియంత్రించేందుకు వీఎంసీ అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు వైసీపీ నేతలు, కార్పొరేటర్లు గండికొడుతున్నారు. అనధికార కట్టడాల విషయంలో తమకు సహకరిస్తే సరేసరి.. లేకుంటే సిబ్బందిపై దాడులు చేయించేందుకు సైతం వారు వెనుకాడటం లేదు. అందుకు నిదర్శనమే బుధవారం 16వ డివిజన్‌లోని కృష్ణలంక కళానగర్‌ ప్రాంతంలో చోటుచేసుకున్న ఘటన. ఇరిగేషన్‌ స్థలాన్ని ఆక్రమించి రెండంతస్థుల భవనాన్ని నిర్మిస్తున్న వారిని అడ్డుకునేందుకు వెళ్లిన సచివాలయ సిబ్బంది, వీఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం అధికారులపై స్థానిక కార్పొరేటర్‌ భర్త బహదూర్‌ ప్రోత్సాహంతో అనధికార కట్టడం యజమానులు దాడికి తెగబడ్డారు.

నగరంలోని కృష్ణలంక కళానగర్‌ ప్రాంతంలో ఇరిగేషన్‌ స్థలాన్ని ఆక్రమించి కొందరు రెండంతస్థుల భవనం నిర్మిస్తున్నారు. ఈ భవన నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవని, దాన్ని వెంటనే నిలిపివేయాలని స్థానిక వార్డు సచివాలయ ప్లానింగ్‌ సెక్రటరీ గంజి పావని భవన నిర్మాణదారులను కోరారు. తమకు కార్పొరేటర్‌ భర్త బహుదూర్‌ అనుమతి ఇచ్చారని, అందుకే ఇంటి నిర్మాణం చేపట్టామని భవన నిర్మాణదారులు తెలిపారు. వీఎంసీ నుంచి అనుమతి లేని నిర్మాణాలను కూల్చివేయాలని కమిషనర్‌ ఆదేశించారని పేర్కొంటూ పావని తన తోటి సచివాలయ సిబ్బందితో కలిసి బుధవారం అనధికార నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు. అదే సమయంలో వీఎంసీ అధికారులు సైతం అక్కడికి చేరుకున్నారు. మరోవైపు కార్పొరేటర్‌ భర్త బహదూర్‌ కూడా అక్కడికి చేరుకున్నారు. అనధికార కట్టడాన్ని కూల్చివేసేందుకు వీఎంసీ సిబ్బంది సిద్ధమవుతుండటంతో కార్పొరేటర్‌ భర్త ప్రోత్సాహంతో భవన యజమానులు సిబ్బందిపై ఎదురుదాడికి దిగారు. తమ కట్టడం జోలికి వస్తే పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఆ ప్రయత్నంలో సచివాలయ సిబ్బందిపైనా పెట్రోలు పడటం.. కొందరి కళ్లలో కూడా పడటంతో వారందరూ భయంతో అరుస్తూ పరుగులు తీశారు. ఈ ఘటనతో షాక్‌కు గురైన వీఎంసీ సిబ్బంది విషయాన్ని కమిషనర్‌ ప్రసన్న వెంకటేశ్‌ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.గతంలోనూ ఇంతే..

అనధికార నిర్మాణాలను ప్రోత్సహించడంలో ముందుంటారని బహదూర్‌కు పేరు. ఈయన గతంలో కార్పొరేటర్‌గా ఉన్న సమయంలోనే వీఎంసీ సిబ్బందిపై దాడులకు తెగబడేవారు. గతంలో ఒక అక్రమ నిర్మాణాన్ని తొలగించే విషయంలో మహిళా బిల్డింగ్‌ ఇన్స్‌పెక్టర్‌పై కూడా రాళ్లు, కర్రలతో దాడి చేయించేందుకు ప్రయత్నించారు. తాజా ఘటనలోనూ బహదూర్‌ ప్రోత్సాహంతోనే వీఎంసీ సిబ్బందిపై అనధికార నిర్మాణం చేపట్టిన భవన యజమాని దాడికి తెగబడ్డారు. బుధవారం ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న బహదూర్‌.. భవన నిర్మాణం జరుగుతున్న ప్రాంతం ఇరిగేషన్‌ స్థలమని, అక్కడ జరిగే నిర్మాణాలను అడ్డుకునే అధికారం టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు లేదని హడావిడి చేయడం గమనార్హం.అందరిదీ అదే తీరు..

ఇటీవల జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైసీపీ తరఫున 49 మంది కార్పొరేటర్లు గెలుపొందారు. వీరిలో అధికశాతం మంది అనధికార కట్టడాలపైనే దందాలు సాగిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలోని 22 డివిజన్లలో ఈ దందా ఎక్కువగా ఉంది. ఇక్కడ మంత్రి అండ చూసుకుని కార్పొరేటర్లు చెలరేగిపోతున్నారు. ఈ కారణంగా ఇక్కడ అనధికార కట్టడాల జోలికి వెళ్లేందుకు సైతం వీఎంసీ అధికారులు హడలిపోతున్నారు. ఫలితంగా వీఎంసీకి రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయానికి గండి పడుతోంది.వార్డు టౌన్‌ ప్లానింగ్‌ సెక్రటరీని చంపుతామని బెదిరించిన ముగ్గురుపై కేసువన్‌టౌన్‌, జూలై 7 : అక్రమ నిర్మాణాలను తొలగించటానికి వెళ్లిన వార్డు టౌన్‌ ప్లానింగ్‌ సెక్రటరీని పెట్రోల్‌ పోసి చంపుతామని బెదిరించిన ముగ్గురిపై బుధవారం కృష్ణలంక పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. రామకృష్ణాపురానికి చెందిన పావని 16వ డివిజన్‌లోని 74వ సచివాలయంలో టౌన్‌ప్లానింగ్‌ సెక్రటరీగా పని చేస్తున్నారు. ఈ సచివాలయ పరిధిలోని కళానగర్‌లో రమణ అనే మహిళ కార్పొరేషన్‌ ఉన్నతాధికారుల అనుమతి లేకుండా భవన నిర్మాణ పనులు మొదలెట్టారు. సమాచారం తెలుసుకున్న పావని, ముగ్గురు ఉద్యోగులతో కలిసి నిర్మాణంలో ఉన్న భవనం వద్దకు వెళ్లారు. అక్రమ నిర్మాణాన్ని తొలగించటానికి ప్రయత్నించగా, రమణ, ఆమె కుమార్తె గోవిందమ్మ, కుమారుడు గణేష్‌ అడ్డుకొని, ఆపితే ఆత్మహత్య చేసుకుంటామంటూ తమ వెంట తెచ్చిన పెట్రోల్‌ ఒంటిపై పోసుకున్నారు. పావని, ఆమె వెంట వచ్చిన సచివాలయ ఉద్యోగులపై కూడా పెట్రోల్‌ పడింది. అక్రమ నిర్మాణాలను తొలగిస్తే చంపుతామని రమణ, గోవిందమ్మ, గణేష్‌ బెదిరించారని పావని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ ముగ్గురుపై కేసు నమోదు

Total Page Visits: 170 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed