SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

రూ.41వేల కోట్లు కాదు.. రూ.400లు కూడా వేరే ఖాతాలో జమ కాలేదు- మంత్రి బుగ్గన స్పష్టీకరణ

1 min read

13.07.2021
విజయవాడ, ఆర్‌ అండ్‌ బి బిల్డింగ్స్

*ఆర్థిక శాఖ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ ప్రెస్ మీట్ పాయింట్స్..*

*- రూ.41వేల కోట్లు కాదు.. రూ.400లు కూడా వేరే ఖాతాలో జమ కాలేదు- మంత్రి బుగ్గన స్పష్టీకరణ*

*- పీఏసీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ ఆరోపణలు అర్ధరహితం*

*- రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అనవసర అనుమానాలు రేకెత్తిస్తున్నారు*

*- ఆడిట్‌ చేసేటప్పుడు కేంద్ర ఆడిట్ సంస్థలు ప్రశ్నలు వేయటం సహజం… వాటి ఆధారంగా టీడీపీ ఆరోపణలా..?*

*- సందేహాలు ఉంటే పీఏసీ ఛైర్మన్‌ హోదాలో మీటింగ్‌ పెట్టి అధికారులను అడగవచ్చు. లేఖలు రాయటం వల్ల ప్రయోజనం ఏంటి..?*

*- బిల్లులు లేకుండా డబ్బులు చెల్లించారన్నది అవాస్తవం*

*- రూ.41 వేల కోట్లకు పూర్తి లెక్కలు ఉన్నాయి.. ప్రతిపక్షం నిజాలు తెలుసుకుని మాట్లాడాలి*

*- చంద్రబాబు హయాంలో సీఎఫ్‌ఎంఎస్‌ను ప్రైవేటు వ్యక్తి చేతిలో పెట్టారు.. దానిలో ఉన్న లోపాలను సరిచేస్తున్నాం*

*- సీఎఫ్‌ఎంఎస్‌ ప్రోగ్రామింగ్ లోపం వల్లే సమస్యలు..*

*- తెలంగాణ వాటాపై ఏపీ అప్పు తెస్తుందంటూ అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు*

*- తెలంగాణ రాష్ట్రంపై మనకు అప్పు ఎలా ఇస్తారు?*

*- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీసుకున్న అప్పును రెండు రాష్ట్రాలు కడుతున్నాయ్‌*

*- ప్రజలకు సబ్సిడీలు ఏమీ ఇవ్వకూడదని చంద్రబాబు అన్నారు*

*- సంక్షోభ సమయంలోనూ సంక్షేమ పథకాలు రూ. లక్ష కోట్లకు పైగా ప్రజల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేశాం*

*- జీతాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఓ పథకం ప్రకారం ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేయాలని టీడీపీ కుట్రలు చేస్తుంది*

*- అప్పులు చేయని రాష్ట్రం, దేశం ఏమైనా ఉందా..?*

*- గత టీడీపీ ప్రభుత్వం అప్పులు చేసి ప్రచారార్భాటాలకు దుబారా చేస్తే.. మేం ప్రతి పైసా సంక్షేమానికి ఖర్చు చేస్తున్నాం*

*శ్రీ బుగ్గన మీడియాతో మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే…*

*రూ.41 వేల కోట్లు అవకతవకలు జరిగితే దేశంలో వ్యవస్థ లేదా?*
*పీఏసీ ఛైర్మనుకు ఏమైనా అనుమానాలుంటే అధికారులతో మాట్లాడొచ్చుగా?*
– గత వారం రోజులుగా ఆర్థిక అంశాలపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, పీఏసీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ మాట్లాడుతూ.. “రూ.41 వేల కోట్లకు లెక్కలు లేవు అని.. ఓచర్లు లేకుండా చెల్లింపులు చేశారని, ఆర్థిక శాఖలో అవకతవకలు జరిగాయని, కాగ్‌తో ఆడిట్ జరిపించండని గవర్నర్‌కు ఫిర్యాదు ఇచ్చారని” మీడియాలో కథనాలు వచ్చాయని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. పీఏసీ ఛైర్మెన్‌ పయ్యావుల కేశవ్‌, టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు, బిల్లులు లేకుండా డబ్బులు చెల్లించారన్నది పూర్తిగా అవాస్తవమ‌ని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ స్పష్టం చేశారు. తెలంగాణ వాటాపై ఏపీ అప్పు చేసిందని పయ్యావుల విమర్శలు చేయటం హాస్యాస్పదం అన్నారు. తాను నియోజకవర్గ పర్యటనలో ఉండగా.. ఈ ఆరోపణలు చూస్తే ఆశ్చర్యమేసిందన్నారు.

“టెక్నికల్ ఇష్యూస్ పక్కన పెడితే.. కామన్‌సెన్స్‌తో ఆలోచిద్దాం. దేశంలో వ్యవస్థలు లేవా? రూ.41వేల కోట్ల సంగతి అవతల పెడితే.. రూ.400లు కూడా ఒకరి ఖాతాలో నుంచి మరో ఖాతాలోకి వెళ్తే.. బ్యాంకు మేనేజర్ తర్వాత రోజు పాస్‌బుక్‌లో సరిచేస్తారు. మరి, రూ.41వేల కోట్లు అవకతవకలు జరిగితే కాగ్‌తో ఆడిట్ జరిపించాలని, కాగ్‌ లేఖను చూపించటమేంటి? కాగ్‌ కింద డివిజనే ఏజీ ఆఫీసు. మామూలుగా చిన్న మొత్తం వేరే ఖాతాలోకి వెళ్తేనే.. బ్యాంకులు సరిచేస్తారు. మరి, ఇంత అమాయకంగా పీఏసీ ఛైర్మన్ ఎలా మాట్లాడతారని” మంత్రి బుగ్గన ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న రూ. 41 వేల కోట్లల్లో.. వాడలేకపోయిన రూ. 10,895 కోట్ల నిధులు కన్సాలిడేటెడ్ ఫండ్ కు చెల్లించామని, రీవాలిడేషన్ ఫండ్స్ రూ. 8,869 కోట్లు.. ఒక కార్పొరేషన్‌ నుంచి మరో కార్పొరేషన్‌కు నిధులు చెల్లింపు.. ఇలా ప్రతి రూపాయికీ ఏజీ ఆఫీసుకు లెక్క చెప్పడం జరిగిందని బుగ్గన తెలిపారు. గోల్ మాల్.. అంటూ ఉంటే తెలుగుదేశం పార్టీదే గానీ, ప్రభుత్వానిది కాదని బుగ్గన అన్నారు.

*అజ్ఞానంతో మాట్లాడితే ఏం జరుగుతుందో తెలిసే యనమల మౌనంగా ఉన్నారు*
– ఇలాంటి అంశాల్లో మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మౌనంగా ఉన్నారు. పయ్యావుల ఉత్సాహంగా పరిగెత్తుతున్నారు. అజ్ఞానంతో, కాలుజారితే ఏమవుతుందో తెలిసే యనమల మౌనంగా ఉన్నారేమో అని బుగ్గన సెటైర్ వేశారు. పీఏసీ ఛైర్మన్‌కు డౌట్స్‌ ఉంటే.. మీటింగ్‌ పిలవొచ్చు. మీరు అధికారులను అడగొచ్చు. రాతపూర్వకంగా సమాచారం తీసుకోవచ్చు. ప్రభుత్వం రిప్లై ఇవ్వాల్సిందే. పీఏసీ అనేది సెకండ్ బ్యాలెన్స్ ఆన్‌ ది గవర్నమెంట్‌ కూడా. గవర్నర్‌కు, ఢిల్లీకి ఓ లెటర్ రాయడం ఎందుకు..?

– మంగళవారం విజయవాడలోని ఆర్‌ అండ్‌ బీ బిల్డింగ్స్‌ కార్యాలయంలో మీడియా సమావేశంలో బుగ్గన మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అనవసర అనుమనాలు రేకెత్తిస్తున్నారన్నారు. ఆడిట్‌ చేసినప్పుడు పలురకాల ప్రశ్నలు వేస్తారని.. ఆడిట్‌ సంస్థ ప్రశ్నలను ఆధారంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని బుగ్గన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

– పయ్యావుల కేశవ్‌కు సందేహాలు ఉంటే మీటింగ్‌ పెట్టి పరిష్కరించుకోవచ్చని.. లేఖలు రాయటం వల్ల ప్రయోజనం ఏంటో అర్థం కావట్లేదన్నారు. బిల్లులు లేకుండా డబ్బులు చెల్లించారన్నది అవాస్తవమని మంత్రి తెలిపారు. రూ.41 వేల కోట్లకు పూర్తి లెక్కలు ఉన్నాయని.. ప్రతిపక్షం నిజాలు తెలుసుకుని మాట్లాడాలని మంత్రి బుగ్గన హితవు పలికారు. ఏజీ కార్యాలయం నుంచి వచ్చిన లేఖ ను చూపి లేనిపోని ఆరోపణలు చేయడం శోచనీయమన్నారు. రూ.41 వేల కోట్ల బిల్లుల చెల్లింపులపై ఆడిట్ సంస్థ వివరణ కోరింది. ఆ వివరణ ఏజీ కార్యాలయానికి ఇస్తామని బుగ్గన వివరించారు.

*ఈ వ్యవహారానికి సీఎఫ్ఎంఎస్‌ కారణం*
– ఈ పరిస్థితికి సీఎఫ్ఎంఎస్ వ్యవస్థే కారణం. ఈ వ్యవస్థ రాకముందు పేమెంట్స్ అన్నీ ట్రెజరీ ద్వారా జరిగేవి. సీఎఫ్ఎంఎస్ వచ్చిన తర్వాత చెల్లింపులన్నీ కేంద్రీకృతం అయ్యాయి. అయితే.. 02.04.2018న సీఎఫ్ఎంఎస్ ను చంద్రబాబు హయాంలో ప్రారంభించారు. పేమెంట్స్ అనేవి రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నెముక లాంటిది. కానీ ఆ స్థానంలో ఓ ప్రైవేటు వ్యక్తిని తెచ్చి కీలక స్థానంలో కూర్చొబెట్టారు. SAP సొంతంగా అభివృద్ధి చేసుకోకుండా SAP వారికి సీఎఫ్ఎంఎస్ పనిని అప్పజెప్పారు. ERP ప్యాకేజీ సొంతంగా అభివృద్ధి చేసుకోకుండా సీఎఫ్ఎంఎస్ కోసం ప్రైవేటు సంస్థకు రూ.300 కోట్లకు పైన ఇచ్చారు. ప్రైవేటు సంస్థకు సీఎఫ్ఎంఎస్ ప్యాకేజీ అప్పజెప్పి పూర్తి కాకుండా టీడీపీ ప్రభుత్వం వెళ్లిపోయింది. ఆ సీఎఫ్ఎంఎస్ లో ఉన్న లొసుగులు కనుక్కుంటూ.. వాటిని సరిచేసుకుంటూ వస్తున్నామని బుగ్గన వివరించారు. ఇంకా ఆ లొసుగులు పూర్తి కావటానికి ఇంకా సంవత్సరంపైనే పడుతుందని తెలుస్తోందని బుగ్గన తెలిపారు.

*సీఎఫ్ఎంఎస్ వచ్చిన తర్వాతే.. ఫిర్యాదులు*
– ఉదాహరణకు గతంలో ఏ పేమెంట్ అయినా సబ్‌ ట్రెజరీ ఆఫీసుకు వెళ్లి.. సబ్‌ ట్రెజర్ ఆఫీసు అథెంట్‌కేషన్ చేసిన తర్వాత పేమెంట్ జరగాలి. ఇప్పుడు కంప్యూటర్ ద్వారా వెళ్తుంది కాబట్టి.. ఎన్నో పనులకు సీఎఫ్ఎంఎస్ ఆథరైజేషన్ ప్యాకేజీలో, ప్రోగ్రాంలో భాగంగా ఉండాలి అయితే అది లేదని బుగ్గన వివరించారు. ఇలా ఒక్కటి కాదు.. ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయ్. దాదాపు కొంతవరకు సరిచేశాం. ఇంతకుముందు చాలా మంది మాకు జీతాలు రాలేదని ఫిర్యాదులు చేసేవారు. కానీ వాటిని సరిచేస్తున్నామని బుగ్గన వివరించారు. 2018లో ఈ వ్యవస్థను మొదలుపెట్టింది టీడీపీ ప్రభుత్వమే అది కూడా ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టారు. దీన్ని సరిచేస్తూ వచ్చాం ఇంకా చేయాల్సి ఉంది.

*మార్చి 31లోపు ఖర్చు చేయకపోతే ఆ నిధులు తిరిగి కేంద్రానికి వెళ్లిపోతాయ్‌*
– ప్రభుత్వం 10161 బిల్లుల ద్వారా రూ. 41 వేల కోట్లు వ్యయం చేయడం జరిగిందని, దీనికి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని బుగ్గన అన్నారు. ఇందులో రూ.10895 కోట్లు పిడి ఖాతాకు చెల్లించామని, కేంద్ర ప్రాయోజిత పధకాల కోసం 2020-21లో ఈ మళ్లింపు చేసినట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వివరించారు. 15 బిల్లులకు రూ.10,895 కోట్లు పీడీ ఖాతాకు మళ్లించామన్నారు. ఆ పీడీ ఖాతాలో కేంద్ర ప్రభుత్వ పథకం ఉంటుందని ఆయన తెలిపారు. ఉదాహరణకు ఎన్‌ఆర్‌జీఈఎస్‌ (ఉపాధిహామీ) ఆ పీడీ ఖాతా ఉంటుందన్నారు. ఆ ఉపాధి హామీ పథకం ఖాతాలో బడ్జెట్‌ ఏదైతే రిలీజ్‌ చేస్తారో.. అవి మార్చి 31 నాటికి వాడని నిధులు కేంద్ర ప్రభుత్వ సంచితనిధికి (Consolidated fund) తిరిగి వెళ్లిపోతాయని బుగ్గన తెలిపారు.

*10,161 బిల్లుల ద్వారా రూ. 41 వేల కోట్లు వ్యయం*
– గతంలో కేంద్రం నిధుల్ని బ్యాంకుల్లో పెట్టేవారు. సకాలంలో వాడకపోతే బ్యాంకు నుంచి మళ్లీ ట్రెజరీ ద్వారా వెనక్కి వెళ్లిపోయేవి. దానికి TDS సిస్టం వాడేవారు. కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్‌ సిస్టంలో ఆటోమ్యాటిక్‌గా కాప్చర్ కావాలి. కానీ ఇక్కడ ఆటోమ్యాటిక్‌గా తీసుకునే విధానం లేదని బుగ్గన వివరించారు. అందుకని.. 15 బిల్లులు కేంద్ర ప్రయోజిత పథకాల కోసం 2020-21లో మళ్లింపులు జరిగాయన్నారు. 2018-19లో రూ.19,530 కోట్లు ఉందని ఈ విధానంలోనే జరిగిందన్నారు. మార్చి 31న ఆ డబ్బులు తిరిగి కేంద్ర ప్రభుత్వ 2019-20లో రూ.20,998 కోట్లు వచ్చాయన్నారు. కేంద్రం నుంచి వివిధ పథకాల (central assistance for state plans) నిధులు వస్తుంటాయి. అవి మురిగిపోకుండా మార్చి 31న వాటిని రీవాలిడేషన్‌ చేస్తామని బుగ్గన వివరించారు. అలా 2020-21లో 1,001 బిల్లులు రూ.8,869 కోట్లు రీవాలిడేషన్ చేశామని బుగ్గన తెలిపారు. అవిమాత్రమే కాకుండా ఒక కార్పొరేషన్‌ నుంచి మరో కార్పొరేషన్‌కు నిధులు చెల్లింపు చేశామని అలా మూడు బిల్లులు రూ.10,895 కోట్లు చేశామన్నారు.

*ఇ-కుబేర్ ద్వారా నిధులు పంపిణీ కుదరక ఆర్టీజీఎస్ ద్వారా చెల్లింపులు చేశాం*
– రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకు నేరుగా నిధులు వెళ్లాలని, కేంద్ర సంస్థ ఇ-కుబేర్ ద్వారా రూ.2728 కోట్లు చేస్తే కుదరక మళ్ళీ మన ఆర్జీజీఎస్ ద్వారా చేశామని బుగ్గన తెలిపారు. హెడ్‌ ఆఫ్ అకౌంట్స్ చేసినా మార్పు చేయాల్సి వస్తుంది. ప్రింట్‌ మీడియా అడ్వర్టైజ్‌మెంట్‌కు రూ.261 కోట్లు ఇచ్చి.. తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించినదని సరిచేయటం జరిగింది. ఇదొక సిస్టం. ఇలా 8 బిల్లులు.. రూ.507 కోట్లు చెల్లింపులు జరిగాయన్నారు. రైతు భరోసాకు ఎలా జరిగిందో అలాగే చేయూతకు సంబంధించి రూ.4179 కోట్లు చెల్లింపులు జరిగాయన్నారు. ఆఫీసు విజయవాడ నుంచి ఏలూరుకు మారింది. దానికి సంబంధించిన బిల్లులు ఉన్నాయి. కొత్తగా మారిన మున్సిపాలిటీల 44 బిల్లులు రూ.14.32 కోట్లు ఉన్నాయి. న్యూ పింఛన్‌ స్కీంలో కట్టక తర్వాత కట్టిన 1051 బిల్లులు రూ.1.54 కోట్లు, వర్క్‌ కాంట్రాక్ట్‌, సర్వీస్ కాంట్రాక్ట్ జరిగితే..జీఎస్‌టీ కట్టాలి. బిల్లు పేమెంట్ చేసేటప్పుడే జీఎస్టీ కట్‌ అవుతుంది. అలాంటివి 8602 బిల్లులు రూ.224 కోట్లు ఉన్నాయని.. జీఎస్టీ కట్టినా.. అకౌంట్ తప్పో, ఇంకొక ఎంట్రీ తప్పో ఉంటో.. 2 బిల్లులు 8 లక్షలు .. ఇలా రీప్రాసెస్‌ అవుతాయని బుగ్గన వివరించారు.

*రూ.8 లక్షల వ్యయం నుంచి ప్రతిదీ లెక్క ఉంది – బుగ్గన*
– ఈచెల్లింపులకు సంబంధించి రూ. 8 లక్షల వ్యయం నుండి ప్రతిదానికీ ప్రభుత్వం వద్ద లెక్కలు ఉన్నాయని, ఎలాంటి అవకతవకలకు తావు లేదన్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా ఇటువంటి ఆరోపణలు చేయడం ప్రతిపక్షాలకు తగదని మంత్రి అన్నారు. ఈసమస్యకు సియఫ్‌యంయస్ వ్యవస్ధే కారణమన్నారు. సియఫ్‌యంయస్ ద్వారా చెల్లింపులు అన్నీ కేంద్రీకృతం కావడమేనన్నారు. రూ.10,161 బిల్లుల ద్వారా 41 వేల కోట్లు వ్యయం చేశాం. ఇందులో అవకతవకలకు తావెక్కడ ఉందని బుగ్గన నిలదీశారు. పీఏసీ చైర్మన్ కు అవసరం అయితే లెక్కలు కోరవచ్చు వాటిని ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టేందుకు ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారు.

*దీపావళి 40కె టపాసుల్లా.. ప్రతిపక్షం 41వేల కోట్ల ఆరోపణలున్నాయ్‌*
– పొరుగు రాష్ట్రం పేరుతో మనం అప్పు ఎలా తీసుకుంటాం?
దీపావళి టపాసులా 40థౌజెండ్ వాలా అన్నట్లు.. ప్రతిపక్షం ఆరోపణలు చేసిందన్నారు. తెలంగాణ వాటాపైన ఏపీ అప్పులు ఎలా చేయగలుగుతుంది. కేంద్రం రాసిన లేఖ ప్రకారం ఆ రాష్ట్ర కోటాను ఏపీ వినియోగించుకున్నట్టు రాశారు. కానీ దాన్ని ఏపీ వినియోగించుకోలేదని బుగ్గన వివరించారు. 30 జూన్ 2021న కేంద్రం లేఖ రాసింది. మన స్థూల ఉత్పత్తిలో 3.5% మీద మాత్రమే అప్పు చేయవచ్చు. రాష్ట్ర పునర్వవ్యవస్థీకరణ కింద ఖాతా పెట్టారు. తెలంగాణ అప్పు కట్టినా, మనం అప్పు కట్టినా.. మన ఖాతా నుంచి జరుగుతుందని బుగ్గన తెలిపారు. ఇది ప్రతి ఒక్కరి దృష్టిలో ఉంటుందన్నారు. ఫైనాన్స్‌ కమిషన్ నిర్ణయాలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు ప్రకారం అప్పులు ఇస్తారు. తెలంగాణ అప్పు కూడా ఆంధ్రప్రదేశ్‌లో జమ అయిందన్నారు. 2016-17లో రూ.5,622 కోట్లు తిరిగి కట్టాలి. అందులో తెలంగాణ వాటా రూ.1283 కోట్లు ఉంది. 2017-18లో రూ.9450 కోట్లులో తెలంగాణ వాటా రూ.2,771 కోట్లు. 2018-19లో రూ.13,544 కోట్లు. తెలంగాణ వాటా అందులో రూ.4,557 కోట్లు. 2019-20లో రూ.18,265 కోట్లు. అందులో తెలంగాణ వాటా రూ.6,411 కోట్లు. ఈ తెలంగాణ వాటా ఏదైతే మన దాంట్లో పొరపాటున ఎంట్రీ అయింది. ఆ ఎంట్రీ వల్ల మనకు పర్మిషన్ వచ్చిందని అది తగ్గించుకుంటామని లేఖ వచ్చింది. 2016-17 ఎంతైతే మనం రుణం తీసుకునే హక్కు ఉంటుందో..రూ.24,418 కోట్లు.. 2017-18లో రూ.33,244 కోట్లు, 2018-19లో రూ.41,113 కోట్లు. 2019-20లో రూ.53,576 కోట్లు. 20201-21లో రూ.63,167 కోట్లు మనకు రుణంగా వచ్చిన హక్కు అని బుగ్గన వివరించారు. 2016-17లో రూ.21,229 కోట్లు, 2017-18లో రూ.25,429 కోట్లు, 2018-19లో రూ.33,554 కోట్లు, 2019-20లో రూ.45,645 కోట్లు,2020-21లో 54,629 కోట్లు రుణంగా తీసుకున్నాం. పరిమితులకు లోబడే రుణాలు తీసుకుంటున్నామని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వం కారణంగానే రూ.16,412 కోట్ల పరిమితిని కేంద్రం తగ్గించిందన్నారు. అందులో రూ.392 కోట్లు, రూ.1013 కోట్లు ఉదయ్‌ స్కీం కింద వచ్చిన నష్టాలు అని బుగ్గన తెలిపారు.

*అప్పులు చేయని రాష్ట్రం, దేశం లేదు*
– కోవిడ్ వల్ల ఆర్థికాభివృద్ధి మందగించింది
రాష్ట్ర స్ధూల ఉత్పత్తిని పరిగణనలోనికి తీసుకుని రాష్ట్రం రుణం తీసుకునే అవకాశం ఉందని, పరిమితికి మించి రుణం తీసుకోలేదని మంత్రి అన్నారు. గత ప్రభుత్వం కోట్లాది రూపాయలు రుణాలు చేసి ఏఒక్క సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయకపోగా ఒక్క పరిశ్రమను కూడా స్ధాపించకుండా కాలయాపన చేసి ప్రజలను మభ్యపెట్టారన్నారు. డేటా ఎంట్రీ లోపం కారణంగా పొరుగురాష్ట్రం వాటాపై కూడా మన ప్రభుత్వం అప్పులు తీసుకున్నట్లు చూపించారని ఇందులో ఎటువంటి వాస్తవం లేదని, దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ అన్నారు.

– ఏపీలో 2014-2019 వరకూ రుణాల వృద్ధి 18.36%గా నమోదు అయ్యింది. 2019 నుంచి 16 శాతం వృద్ధి నమోదు అయ్యింది. సంక్షేమ పథకాలు యధావిధిగా కొనసాగిస్తున్నాం. గత ప్రభుత్వం పెట్టిన పథకాల బకాయిలు అన్నీ చెల్లింపులు చేస్తున్నాం. కోవిడ్ నిర్వహణలో ఏపీ ఉత్తమ పనితీరు కనపర్చింది. పీఏసీ చైర్మన్ సమాచారం అడిగి తెలుసుకుని ప్రశ్నించాలని కోరుతున్నాం. జీతాలు ఏమి పెండింగ్ లో లేవు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇబ్బందులు వచ్చాయి. పరిపాలనకు, సామాన్యులకు సంక్షేమం అందించేందుకు రుణాలు తీసుకోవాల్సి వస్తుంది. ఏ రాష్ట్రం, ఏ దేశం అప్పు చేయలేదో ప్రతిపక్ష పార్టీ చెప్పాలి. రైతులు, మహిళలు, విద్యార్థుల ఖాతాలో సంక్షేమ నిధులు జమ అవుతున్నాయి. గతంలో గుర్తు తెలీని ఎవరికో సూట్ వేసి తీసుకువచ్చి పరిశ్రమలు వచ్చాయంటూ ఒప్పందాలు చేసుకున్నారని బుగ్గన మండిపడ్డారు. వాళ్లు చైనా నుంచి వచ్చారో, లేక హైదరాబాద్ సెక్రటేరియట్‌ నుంచి సూట్‌,బూట్‌ వేసుకొని తెచ్చారా అని బుగ్గన ఎద్దేవా చేశారు. పరిశ్రమలు శ్రీసిటీలో వచ్చాయి. అది స్థాపించిందెవరో తెలుసా అని బుగ్గన నిలదీశారు.

– 2019-20లో రూ.45,645 కోట్లు, 2020-21లో రూ.5,602 కోట్లు రుణంగా తీసుకోవడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పరిమితులకు లోబడే రాష్ట్ర ప్రభుత్వం రుణాల ను తీసుకోవడం జరిగిందని మంత్రి వివరించారు. మన రాష్ట్రం ఒక్కటే కాదు.. అన్ని రాష్ట్రాల పరిస్థితి ఇలాగే ఉందన్నారు. కేంద్రం పరిస్థితి కూడా అంత బాగా లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం 2014-19 మధ్య CAGR (Compound Annual Growth Rate) 8.44% ఉంటే.. అదే సమయంలో ఏపీ రాష్ట్రంలో CAGR 18.36% ఉందని బుగ్గన తెలిపారు. 2019-21లో కేంద్రం CAGR 15.26% ఉంటే.. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 16% ఉందని బుగ్గన తెలిపారు. మనం కేంద్రం, ఇంచుమించు సమానంగా ఉన్నామని బుగ్గన వివరించారు. గతంలో మన రాష్ట్రం.. కేంద్రం అప్పు కంటే మూడింతలు అప్పు ఎక్కువగా ఉందని బుగ్గన తెలిపారు. దీనికి ఎవరు సమాధానం చెబుతారని బుగ్గన ప్రశ్నించారు. పరిస్థితులు బాగాలేక ఇలాంటి పరిస్థితులు వచ్చాయన్నారు.

*కష్టకాలంలోనూ సంక్షేమానికి ఏలోటూ రానివ్వలేదు*
– పన్ను వసూళ్లు తగ్గాయని, రాబడి లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి ఇదేనని అన్నారు.కోవిడ్ కారణంగా గత ఏడాది నుండి ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రతీ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తూ ఏపి ప్రభుత్వం ఉత్తమ పనితీరును కనబరిచిందన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన పధకాలకు సంబంధించి అన్ని బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించిందన్నారు. గత రెండు సంవత్సరాలుగా ఈప్రభుత్వం వివిధ సంక్షేమ పధకాల ద్వారా రూ. లక్ష కోట్ల రూపాయలకు పైగా నేరుగా రైతులు, మహిళలు, విద్యార్ధుల ఖాతాలో సంక్షేమ నిధులు జమచేశామని మంత్రి వివరించారు.
– ప్రభుత్వ పరిపాలనలో సామాన్యులకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేందుకు రుణాలు తీసుకోవాల్సివస్తుందన్నారు. దేశంలో కేంద్ర ప్రభుత్వంతోపాటు అన్ని రాష్ట్రాలు ఇదే విధానాన్ని అవలంభిస్తాయని అప్పు చేయడమనేది కేవలం మన రాష్ట్రమే చేసింది కాదనేది ప్రతిపక్షాలు గుర్తెరెగాలన్నారు. వ్యవసాయం దండగ, సబ్సిడీలు పులిమీద స్వారీలు, ఉచిత విద్యుత్ ఇస్తే.. కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందే అని చంద్రబాబు అన్నారని బుగ్గన గుర్తు చేశారు. పైగా దావోస్, ఇటలీ వారు చంద్రబాబునే రమ్మంటారని రాసుకున్నారు. పైగా రుణాల విషయంలో రైతులను, పొదుపు మహిళలను చంద్రబాబు భ్రష్టు పట్టించారు. విత్తనాల సబ్సిడీ, సూక్ష్మపోషకాలు, పరిశ్రమల ప్రోత్సాహకాలు, అడ్వర్టైజ్‌మెంట్‌, ఇలా అనేక పథకాలకు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టి వెళ్లిపోయారన్నారు.

*కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌లో రాష్ట్ర ప్రభుత్వ తీరును ఢిల్లీలో మెచ్చుకున్నారు*
– కోవిడ్ మేనేజ్‌మెంట్‌లో ఏపీ తీరును ఢిల్లీలో అందరూ మెచ్చుకుంటున్నారు. సస్టయినబుల్‌ గోల్స్‌లో 4వ స్థానంలో ఏపీ ఉందన్నారు. ఇలాంటి విషయాలను ప్రతిపక్షం మెచ్చుకోకపోగా విమర్శలు చేయటం సరికాదన్నారు. దున్నపోతు ఈనింది అంటే.. దూడను కట్టేయండని అన్నట్లు ప్రతిపక్షం తీరుందన్నారు. ఏదో ఒకటి చూడటం.. ఏదో ఒకటి మాట్లాడటం సరికాదన్నారు. పయ్యావుల కేశవ్‌ సమాచారం తెల్సుకొని మాట్లాడాలి. అంతేకానీ మీడియా మీద గ్రిప్‌ ఉందని ఆరోపణలు చేయటం సరికాదని బుగ్గన హితవు పలికారు.

Total Page Visits: 38 - Today Page Visits: 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed