SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

రుయాలో దొంగల బెడద..అసాంఘిక శక్తుల హల్‌చల్‌

1 min read


ఏసీలు, మానిటర్లు మాయం
తిరుపతిలోని రుయాస్పత్రి అసాంఘిక శక్తులకు, దొంగలకు అడ్డాగా మారుతోంది. ఇటీవల ఆస్పత్రిలో దొంగల బెడదతో పాటు బయట మందుబాబుల గోల ఎక్కువైంది. ఆపరేషన్‌ థియేటర్లలోని విలువైన వస్తువులతో పాటు వెలుపల ఉండే వస్తువులను కూడా దొంగలు ఎత్తుకెళ్లిపోతున్నారు. ఆపరేషన్‌ థియేటర్లలో ఏసీలను అమర్చేందుకు ఓ ఎలకా్ట్రనిక్స్‌ వ్యాపార సంస్థనుంచి రూ7.66 లక్షలతో 20 ఎయిర్‌ కండిషనర్లను రుయా స్పత్రి అధికారులు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన కాపర్‌ వైర్‌, ఇతర మెటీరియల్‌ను రుయా ప్రాంగణానికి సదరు వ్యాపార సంస్థ సరఫరా చేసింది. వాటిని అమర్చేందుకు వచ్చిన మరో సంస్థ కాపర్‌ వైరుతో పాటు ఇతర సామగ్రిని దొంగలు ఎత్తుకెళ్లినట్టు గుర్తించింది. ఈ విషయాన్ని రుయా అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వారు అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. చోరీకి గురైనవి మళ్లీ కొనుగోలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇదిలావుంటే ఫిమేల్‌ మెడికల్‌ ఐసీయూలో వెంటిలేటర్లకు ఉండే నాలుగు మానిటర్లు కనిపించడంలేదని సిబ్బంది గుర్తించారు. వీటివిలువ దాదాపు రూ.2లక్షలకు పైగానే ఉంటుందని చెబుతున్నారు.

Read also

ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రోగులకు మెరుగైన వసతులు, చక్కని హాస్పిటాలిటీ కల్పించాలనే ఉద్దేశంతో గత టీడీపీ ప్రభుత్వం లెనిన్‌ బెడ్‌షీట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రోజూ రోగి పడకపై బెడ్‌షీట్‌ మార్చాలని అందుకు గుర్తుగా కలర్‌ కోడ్‌ను కూడా సూచించింది. ఇప్పుడు ఆ బెడ్‌షీట్లు కూడా కనిపించడంలేదని సమాచారం. అదేవిధంగా ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో గత ఏడాది లక్ష రూపాయల విలువగల లాప్రోస్కోపీ బల్బ్‌ పోయినట్టు గుర్తించారు. ఈ మూడేళ్ల కాలంలో ఆసుపత్రి ప్రాంగణంలో పార్కుచేసి ఉంచిన దాదాపు 30 బైకులు చోరీకి గురయ్యాయి. కొన్ని వస్తువులను బయట దొంగలు ఎత్తుకెళితే, మరికొన్ని ఇంటిదొంగలే తీసుకెళ్లారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు రుయాస్పత్రి ప్రాంగణం రాత్రివేళల్లో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతోంది. ఒకవైపు పూర్తి స్థాయిలో సెక్యూరిటీ సిబ్బంది, మరోవైపు అవుట్‌ పోలీస్‌స్టేషన్‌ ఉన్నప్పటికీ రాత్రి 8 గంటలు దాటితే చాలామంది మద్యం తాగుతూ కనిపిస్తుంటారు. తాజాగా ఓ మహిళను ఇంట్లో చంపి రుయాస్పత్రి ప్రాంగణానికి తీసుకొచ్చి కాల్చేశారంటే అక్కడ ఎలాంటి గస్తీ నిర్వహిస్తున్నారో అర్థమవుతోంది.

Total Page Visits: 46 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed