SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను వైసీపీ నేతలు.దౌర్జన్యం

1 min read

ప.గో.జిల్లా: రోడ్లపై గుంతలు పూడుస్తున్న టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు సమీపంలో సోమవరప్పాడు వద్ద రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల మరమ్మతులను పట్టించుకోకపోవడంతో చింతమనేని స్వయంగా పలుగు, పార పట్టారు. వాహనదారుల ఇబ్బందులు చూసి వర్షంలోనే గోతులు పూడ్చేందుకు ప్రయత్నం చేస్తుండగా వైసీపీ నేతలు అడ్డుకోడానికి ప్రయత్నించారు.

ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ ఏలూరు-జంగారెడ్డి గూడెం రోడ్డు సోమవరప్పాడు దగ్గర నుంచి గోపన్నపాలెం వరకు గోతులు ఏర్పడి.. రోడ్డేదో, గొయ్యేదో తెలియని పరిస్థితిలో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు, అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు.. రోడ్డుపై గుంతలను సర్పంచ్‌లు, టీడీపీ నేతల సహకారంతో పూడుస్తున్నామన్నారు. రాజకీయ లబ్దికోసం ఈ పనిచేయడంలేదన్నారు. మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేల్కొల్పటానికే తమ ప్రయత్నమని చింతమనేని స్పష్టం చేశారు.

Also read.

Total Page Visits: 197 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed