SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

మహిళల,శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం_ ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్‌ ఐపీఎస్

1 min read

కృష్ణాజిల్లా మచిలీపట్నం

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల లో భాగంగా కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా బదిలీ కావడంతో ఆ స్థానంలో ప్రకాశం జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు కృష్ణా జిల్లా ఎస్పీగా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. 2012 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఈయన తొలుత గ్రేహౌండ్స్ లో విధులు నిర్వర్తించి అనంతరం పార్వతీపురం ,విశాఖపట్నం నందు ఏఎస్పీగా ,ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాధారణ బదిలీలు లో భాగంగా కృష్ణా జిల్లా ఎస్పీగా నియమితులై ఈరోజు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఏఆర్ సిబ్బందిచే గౌరవవందనం స్వీకరించి, బాధ్యతలు చేపట్టారు._

_అడిషనల్ ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపీఎస్ గారు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపిఎస్ గారు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ గారు ఎస్పీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు_

_ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ కృష్ణా జిల్లా ఎస్పీగా రావడం తనకు చాలా సంతోషంగా ఉందని, ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గారికి రాష్ట్ర డిజిపి శ్రీ గౌతమ్ సవాంగ్ ఐపీఎస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో పనిచేసిన ప్రాంతానికి ఈ ప్రాంతానికి వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా విధులు నిర్వహిస్తామని, సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కార్యాచరణ రూపొందిస్తూ నూతన ప్రణాళికలు చేపడతామని, మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ మహిళా సంక్షేమానికి వినూత్న కార్యక్రమాలు చేపడుతూ, అసాంఘిక కార్యకలాపాలు, నిలువరిస్తూ నేర రహిత జిల్లాగా కృష్ణా జిల్లా మార్చడం లో తనదైన పాత్ర పోషిస్తూ రాష్ట్రంలో జిల్లాను ప్రగతిపథంలో నిలపడానికి అన్ని వేళలా కృషి చేస్తానని తెలిపారు._

_రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ప్రకారం మహిళల భద్రత వారి రక్షణ కొరకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ, మహిళా సాధికారత కొరకు అహర్నిశలు కృషి చేస్తామని, బడుగు బలహీన వర్గాల వారికి సమన్యాయం అందేలా, సమస్యతో వచ్చిన ప్రతి ఒక్క బాధితుడికి తక్షణ పరిష్కారం అందేలా కృషి చేస్తామని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరుస్తూ జిల్లా పోలీసు శాఖ లో పనిచేస్తున్న ప్రతి ఒక్క సిబ్బంది సంక్షేమానికి నా వ్యక్తిగత ప్రాధాన్యత అందిస్తూ, అసాంఘిక కార్యకలాపాలు అయినా గుట్కా, గంజాయి, అక్రమ మద్యం, ఇసుక రవాణా అరికట్టడం, నాటు సారా తయారీ ని సమూలంగా నిర్మూలించే ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలియజేశారు_

_అనంతరం అల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సబ్ డివిజన్ల పోలీస్ అధికారులు, సిబ్బంది, కార్యాలయ సిబ్బంది, డిసిఆర్బి, డిటిఆర్బి , ఏ.ఆర్,ఐటీ కోర్, అన్ని విభాగాల అధికారులు సిబ్బంది ఎస్పీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు._

Also read

Total Page Visits: 87 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed