SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

మళ్లీ చినికి చినికి గాలివానలా మారుతోన్న సరిహద్దు గ్రామాల వివాదం

1 min read


సరిహద్దు గ్రామాల వివాదం మళ్లీ చినికి చినికి గాలివానలా మారుతోంది. ఎప్పటికిప్పుడు ఆధిపత్యం కోసం.. ప్రయత్నిస్తూనే…పోలీసులు, కోర్టుల జోక్యంతో కాస్త వెనక్కి తగ్గుతోంది…

మళ్లీ చినికి చినికి గాలివానలా మారుతోన్న సరిహద్దు గ్రామాల వివాదం
సరిహద్దు గ్రామాల వివాదం మళ్లీ చినికి చినికి గాలివానలా మారుతోంది. ఎప్పటికిప్పుడు ఆధిపత్యం కోసం.. ప్రయత్నిస్తూనే…పోలీసులు, కోర్టుల జోక్యంతో కాస్త వెనక్కి తగ్గుతోంది. అయితే, తాజాగా ఆంధ్రా- ఒడిశా బోర్డర్‌లో మళ్లీ ఇలాంటి రగడే రాజుకుంది. ఆంధ్రా- ఒడిశా రాష్ట్రాల మధ్య వివాదంగా ఉన్న 21 గ్రామాల పంచాయితీ మరోసారి తెరపైకి వచ్చింది. విజయనగరం జిల్లా కొటియా గ్రామాల్ని తమ సరిహద్దుల్లో కలుపుకునేందుకు ఒడిశా దూకుడు పెంచింది. ఇందులో భాగంగానే నేరేడువలసలో రాత్రికి రాత్రే ఓ ఆలయ నిర్మాణం చేపట్టింది.

అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర ఆలయ నిర్మాణ పనుల్ని అడ్డుకున్నారు. యధాతధ స్థితిపై సుప్రీం కోర్టు ఆదేశాలున్నప్పటికి వాటిని లెక్క చేయకుండా నిర్మాణాలు ఎలా చేపట్టారంటూ ఒడిశాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే రాజన్నదొర కంప్లైంట్‌తో సీన్‌లోకి ఎంటరైన పోలీసులు తహశీల్దార్ శ్రీనువాసరావు సమక్షంలో ప్రస్తుతం చేపడుతున్న ఆలయ నిర్మాణ పనుల్ని నిలిపివేశారు.


ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా సాలూరు నుంచి సరిగ్గా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నవే కొటియా గ్రామాలు. ఈ గ్రామాల కోసమే ఒడిశా పట్టుబడుతోంది. వీటిని ఎలాగైన సొంతం చేసుకోవాలని ఆరాటపడుతోంది.. సరిహద్దులు దాటొచ్చి.. ఏపీలోకి చొచ్చుకొచ్చి.. ఈ 21 గ్రామాలపై ఒడిశా.. తన అధికారాన్ని బలవంతంగా రుద్దుతోంది. అభివృద్ధి పేరుతో దురాక్రమణ చేస్తోంది. ఇందుకోసం ఇక్కడ భారీగా నిధులు ఖర్చు చేస్తూ తమ ముద్రవేసుకునేందుకు తెగ ప్రయత్నిస్తోంది.

ఇవన్ని ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలో ఉన్న గ్రామాలే అయినప్పటికి సైన్‌ బోర్డుల నుంచీ శిలాఫలకాల వరకూ అన్నీ ఒరియాలోనే ఉంటాయి. ఎక్కాడ తెలుగు ఊసు లేకుండా చేస్తూ వస్తున్నారు ఒడిశా అధికారులు. ఇందులో భాగంగానే మళ్లీ ఇప్పుడు నేరేడువలసలో ఆలయ నిర్మాణం చేపడుతూ దూకుడు పెంచింది ఒడిశా.

Read also

షర్మిల వెనకుంది ఆ ఇద్దరే.. తేల్చేసిన సీనియర్ నేత.. లేకుంటే ఆమె తిరుగుతుందా?

Total Page Visits: 67 - Today Page Visits: 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed