SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు ఏపీ గవర్నర్‌కు లేఖ.. రూ. 41వేల కోట్ల వివాదంపై విచారణ జరిపించాలని..

1 min read

బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌కు లేఖ రాశారు. ప్రస్తుతమున్న రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు..
బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌కు లేఖ రాశారు. ప్రస్తుతమున్న రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు జరుగుతున్నాయని, రూ. 41 వేల కోట్ల వివాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఆయన కోరారు. వైసీపీ ప్రభుత్వ పారదర్శకత లేకుండా వ్యక్తిగత ఖాతాల్లో జమ చేసిందని, వ్యక్తిగత జమ ఖాతాలు కేవలం అత్యవసర పరిస్థితుల్లోనే అధికారులు వినియోగించడానికి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ అని పేర్కొన్నారు. ప్రజాధన వినియోగం ఆర్థిక నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా ఉండాలని, అలా జరగడం లేదంటే ఖచ్చితంగా అవకతవకలకు ఆస్కారం ఇచ్చినట్లేనని లేఖలో పేర్కొన్నారు.

Also read



అయితే గత ప్రభుత్వ హయాంలో కూడా ఇటువంటి ఆరోపణలు వచ్చాయని, 53వేల కోట్లకుపైగా వ్యక్తిగత జమ ఖాతాల నుంచి నిబంధనలకు విరుద్దంగా ఖర్చు చేశారనే ఆరోపణలు కాగ్‌ 2016-17 నివేదికలో పేర్కొన్నట్లు గుర్తు చేశారు. ఆ నివేదిక ఆధారంగా అప్పటి గవర్నర్‌ నరసింహన్‌కు కూడా లేఖ రాసినట్లు జీవీఎల్‌ లేఖలో గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రూ.53 వేల కోట్లు, ఈ ప్రభుత్వ హయాంలో మరో రూ.41వేల కోట్లు మొత్తం కలిపి దాదాపు లక్ష కోట్లు రెండు ప్రభుత్వాల హయాంలో పీడీ ఖాతాల ద్వారా ఎటువంటి పారదర్శకత లేకుండా ఖర్చు చేసినట్లు కాగ్‌ నివేదికలు తెలియజేశాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. వీటిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆయన గవర్నర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఇవి కూడ చదవండి

Total Page Visits: 51 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed