SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

బాక్సైట్ తవ్వకాలకు వైయస్ఆర్సీపీ ప్రభుత్వం వ్యతిరేకం:గుడివాడ అమర్నాథ్

1 min read

జులై 9, 2021
విశాఖపట్నం- వైయస్సార్‌ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

*బాక్సైట్ తవ్వకాలకు వైయస్ఆర్సీపీ ప్రభుత్వం వ్యతిరేకం:గుడివాడ అమర్నాథ్*

*వైయస్సార్‌ సీపీ ఎమ్మెల్యే శ్రీ గుడివాడ అమర్నాథ్‌ ప్రెస్ మీట్ పాయింట్స్..*

*- మైనింగ్ మాఫియా ముఠా సభ్యులే విశాఖ మన్యంలో ఆందోళనలు చేయడం హాస్యాస్పదం*

*- టీడీపీ హయాంలో అయ్యన్న, ఆయన కొడుకు మైనింగ్ మేసేశారు.. వారికి రూ.20 కోట్లు ఫైన్ వేసింది నిజం కాదా..?*

*- లేటరైట్ ముసుగులో టీడీపీ పెద్దలు బాక్సైంట్ తవ్వి పెద్దఎత్తున ఎగుమతులు చేసుకున్నారు.*

*- ఈ ప్రభుత్వం కొత్తగా ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు, హైకోర్టు అనుమతితోనే లేటరైట్ మైనింగ్ చేస్తున్నారు*

*- గత టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా మైనింగ్ మాఫియా విస్తరించింది*

*- ఒక్క చీమకుర్తి ప్రాంతంలోనే రూ. 2500 కోట్ల మైనింగ్ అక్రమంగా తవ్వేశారు.. పల్నాడులో యరపతినేని వందల కోట్ల లైమ్ స్టోన్ గనులు మింగేశారు*

*- ఈ ప్రభుత్వం మైనింగ్ అక్రమాలపై ఉక్కుపాదం మోపుతోంది.. వేల కోట్లు జరిమానాలు విధించింది.*

*- అత్యంత పారదర్శకంగా మైనింగ్ విధానం అమలు చేస్తున్నాం.. టీడీపీ పెద్దల అక్రమాలు తవ్వి తీస్తే ప్రభుత్వంపై నిందలా..*

*- మేం అధికారంలోకి వచ్చాక లేటరైట్‌ తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు.*

*- అవన్నీ చంద్రబాబు నాయుడు హయాంలో ఇచ్చిన అనుమతులే..*

*- మైనింగ్ మాఫియాను పెంచి పోషించింది చంద్రబాబే*

*- చంద్రబాబు బాక్సైట్ దాహానికి నాడు సర్వేశ్వరరావు బలి కాలేదా..?*

*- బాక్సైట్ తవ్వకాలంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది*

చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో మైనింగ్ మాఫియాను పెంచి పోషించారని, చీమకుర్తి, పల్నాడు ప్రాంతాల్లో వేల కోట్ల రూపాయల మైనింగ్ గనులను టీడీపీ పెద్దలు మింగేశారని వైయస్సార్‌ సీపీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ గుడివాడ అమర్నాథ్‌ ధ్వజమెత్తారు. లేటరైట్ ముసుగులో టీడీపీ పెద్దలు బాక్సైంట్ తవ్వి పెద్దఎత్తున ఎగుమతులు చేసుకున్నారని, ఇందులో విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆయన కొడుకు కూడా ఉన్నారని, వారిపై రూ. 20 కోట్లు జరిమానా వేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. దొంగే.. దొంగ అని అరచినట్టుగా టీడీపీ హయాంలో ఎవరైతే మైనింగ్ మాఫియాకు పాల్పడ్డారో, అటువంటి మైనింగ్ మాఫియా ముఠా సభ్యులే ఈరోజు అక్రమ మైనింగ్ అంటూ గోల చేస్తూ, హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డిగారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం మన్యంలో మైనింగ్ కు కొత్తగా ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు అని, హైకోర్టు అనుమతితోనే లేటరైట్ మైనింగ్ జరుగుతుందని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఒక్క చీమకుర్తి ప్రాంతంలోనే రూ. 2500 కోట్ల మైనింగ్ అక్రమంగా తవ్వేశారు.. పల్నాడులో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వందల కోట్ల లైమ్ స్టోన్ గనులు మింగేశారు అని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం మైనింగ్ అక్రమాలపై ఉక్కుపాదం మోపుతోందని.. వేల కోట్ల రూపాయలు జరిమానాలు విధించిందని తెలిపారు. ఈ ప్రభుత్వంలో అత్యంత పారదర్శకంగా మైనింగ్ విధానం అమలు చేస్తున్నాం.. టీడీపీ పెద్దల అక్రమాలు తవ్వి తీస్తుంటే మాపై నిందలు మోపడం టీడీపీ పెద్దలకే చెల్లిందని విమర్శించారు.
విశాఖలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. చంద్రబాబు మైనింగ్ దాహానికి మాజీ గిరిజన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు బలి అయింది నిజం కాదా అని ప్రశ్నించారు. అయిదేళ్ల టీడీపీ పాలనలో ఆ పార్టీ నేతలు అక్రమ మైనింగ్‌తో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని గుర్తు చేశారు. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక అక్రమ మైనింగ్‌కు పూర్తిగా అడ్డుకట్ట వేశామన్నారు. బాక్సైట్‌ తవ్వకాలకు తమ ప్రభుత్వం వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని 2015లోనే ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు స్పష్టం చేశారన్నారు. గిరిజనులు పట్ల ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్దిని ఏ రాజకీయ పార్టీ శంకించాల్సిన అవసరం లేదన్నారు.

*వైయస్సార్‌ సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..*

1- విశాఖ మన్యంలో లేటరైట్‌ తవ్వకాలు అంటూ టీడీపీ హడావుడి చేయడం హాస్యాస్పదంగా ఉంది. వారి హయాంలో మైనింగ్ పేరుతో ఏకంగా అవినీతి సామ్రాజ్యాన్ని నెలకొల్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు దొంగే .. దొంగ దొంగ అన్నట్లు మాట్లాడుతున్నారు.

2- టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు కొన్ని వందల కోట్ల రూపాయలు మైనింగ్‌ పేరిట దోచుకోలేదా? తప్పులు మీరు చేసి, చేయాల్సిన దోపిడీ అంతా మీరు చేసి, తిరిగి మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా..? వీధి నాటకాలు ఆడతారా?

3 – అధికారంలో ఉన్న ఐదేళ్ళూ అక్రమ మైనింగ్‌కు అండగా నిలబడటంతోపాటు, మైనింగ్ మాఫికాయకు అడ్డు వచ్చినవారిని తొలగించే ప్రయత్నం చేసిందీ చంద్రబాబే. విశాఖ మన్యంలో అక్రమ మైనింగ్‌, గంజాయి వ్యాపారం జరుగుతుందంటే.. అందుకు గత టీడీపీ ప్రభుత్వం పెంచి పోషించిన మాఫియానే కారణం.

4 – అక్రమ సంపాదనతో అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేయడమా..? కేవలం 2 ఎకరాల నుంచి రూ. 2 లక్షల కోట్లకు అధిపతిగా చంద్రబాబు నాయుడు ఈరోజు ఎలా ఎదిగారు..? ఆ సీక్రెట్‌ ఏంటో చెబితే రాష్ట్రంలో పేదలే ఉండరు.

5 – బాక్సైట్‌ తవ్వకాలు అంటూ ఉదయం నుంచి అయ్యన్నపాత్రుడు, ఆయన భజన బృందం, తెలుగుదేశం పార్టీ నేతలు హడావుడి చేస్తున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు లేటరైట్‌ ఎక్స్‌పోర్ట్‌ ఎలా చేశారు. చంద్రబాబు, ఆయన కుమారుడు, టీడీపీ నేతలు, వారి వారసులు రాష్ట్రాన్ని దోచేశారు.

6 – చంద్రబాబు అవినీతి సామ్రాజ్యంలో ఓ పునాది రాయి పల్నాడు ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు. పిడుగురాళ్ల ప్రాంతంలో ఆయన అక్రమ మైనింగ్ కు సంబంధించి చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారు. దేవినేని ఉమ అక్రమ మైనింగ్‌, ప్రత్తిపాటి పుల్లారావుల మైనింగ్ మాఫియాల గురించి… ఇక అచ్చెన్నాయుడు ఇసుక దోపిడీ గురించి శ్రీకాకుళంలో ఏ చెట్టు, పుట్టను అడిగినా చెబుతారు.

7 – మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న అనేక అ‍క్రమ క్వారీలు, అక్రమ మైనింగ్‌ వ్యాపారుల మీద ఉక్కుపాదం మోపి, వేల కోట్ల రూపాయలు పెనాల్టీలు వేశామంటేనే మా చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తుంది.

8 – వైయస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో లేటరైట్‌ తవ‍్వకాలపై ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. అటువంటిది, ముఖ్యమంత్రి గారి మీద, ప్రభుత్వం మీద బురద చల్లితే సహించేది లేదు.

9 – మీ అక్రమ మైనింగ్‌ వ్యాపారం కోసం మా పార్టీలో గెలిచిన కిడారి సర్వేశ్వరరావును మభ్యపెట్టి టీడీపీలోకి తీసుకుంది చంద్రబాబు నాయుడు కాదా? చివరకు చంద్రబాబు అక్రమ మైనింగ్‌కు సర్వేశ్వరరావు బలి అయింది నిజం కాదా..?. మాజీ ఎమ్మెల్యే సర్వేశ్వరరావు హత్యకు ప్రధాన ముద్దాయి చంద్రబాబే.

10 – గిరిజనులను కేవలం ఓటు బ్యాంక్‌ గా చూసే చంద్రబాబు, గిరిజనులను అడ్డు పెట్టుకుని ఉత్తరాంధ్ర ప్రాంతంలో మైనింగ్ మాఫియాకు తెరలేపింది నిజం కాదా?.

11 – 2015 డిసెంబర్‌ 15న అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌ గారు చింతపల్లిలో జరిగిన భారీ బహిరంగ సభలో గిరిజన ప్రాంతాల్లో తట్ట మట్టి కూడా తరలిపోతే సహించేది లేదని హెచ్చరించారు. అలాగే గిరిజన ప్రజలు కూడా వైయస్సార్‌ సీపీని ఏవిధంగా బలపరిచారో 2014, 2019 ఎన్నికల్లో చూశాం.

12 – రాష్ట్రంలోనే ఉండని చంద్రబాబు, కేవలం రాజకీయాల కోసం ఇలాంటి సందర్భాల్లో బయటకు వచ్చి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. లేనిపోని అంశాలను తెరమీదకు తెచ్చి నిజ నిర్థారణ కమిటీ అంటూ ఏజెన్సీలో హడావుడి చేస్తున్నారు.
– ప్రభుత్వానికి, ప్రభుత్వ విభాగానికి సంబంధించి కొన్ని సున్నితమైన ప్రాంతాలు ఉంటాయి, అలాంటి ప్రాంతాల్లోకి వెళితే… ఏదైనా జరగరానిది జరిగితే మళ్లీ ప్రభుత్వంపైనే నిందలు వేస్తారు. అందుకే పోలీసులు టీడీపీ నేతల పర్యటనను అడ్డుకున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. పోలీసులు తీసుకోవాల్సిన చర్యలు పోలీసులు తీసుకుంటారు. అనుమతి తీసుకోకుండా ఎక్కడబడితే అక్కడకు వెళ్లడం సరికాదు కదా. ఏది చేయాలన్నా కొన్ని ప్రొసిజర్స్‌ ఉంటాయి. వాటిని బట్టే ముందుకు వెళ్లడం జరుగుతుంది.
– మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలో మా అంతగా మేము లేటరైట్‌ తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు హయాంలో ఇచ్చిన అనుమతులే అవి. ఇప్పుడు తవ్వకాలపై ఉన్న అనుమతులు న్యాయస్థానం నుంచి తెచ్చుకున్నవే.



13 – విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్రంలోని బీజేపీని ప్రశ్నించాల్సిన చంద్రబాబు నాయుడు… వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారిని ప్రశ్నిస్తున్నారు ఇదెక్కడి విడ్డూరం. స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకునే విషయంలో ప్రధానికి ముఖ్యమంత్రిగారు లేఖ రాయడం జరిగింది, అసెంబ్లీలో తీర్మానం చేశారు కూడా.

14 – కరోనా సమయంలో పేదవాడు కష్టాల్లో ఉంటే, వారు కనీసం కూలి పనులు చేసుకునే అవకాశం కూడా లేకపోతే… ఇచ్చిన హామీ మేరకు దాదాపు 1 లక్షా 35 వేల కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి నేరుగా వేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారిది.
– చంద్రబాబు నాయుడులా నిధులు తీసుకువచ్చి అమరావతి పేరుతో దోచేయలేదు. ఒక్క రూపాయి కూడా అనవసరంగా ఖర్చు పెట్టలేదు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు కానీ, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం అయినా ఒక్క రూపాయి కూడా అనవసరంగా ఖర్చు చేయలేదు.

Read also

Total Page Visits: 125 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed