SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ఫేర్వెల్ పెరెడ్ తో ఎస్పి గారికి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు

1 min read

కృష్ణాజిల్లా మచిలీపట్నం

**

_ఫేర్వెల్ పెరేడ్ కు హాజరైన జిల్లా ఎస్పీ శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారు, అడిషనల్ ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపీఎస్ గారు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపిఎస్ గారు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ గారు_

_రెండు సంవత్సరాల పాటు వినూత్న కార్యక్రమాలతో, సిబ్బంది సంక్షేమం లో కృష్ణాజిల్లాలో తనదైన ముద్ర వేసుకొని బదిలీపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా బదిలీ అవుతున్న జిల్లా ఎస్పీ శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారికి ఆర్మూర్ రిజర్వ్ మచిలీపట్నం వారి ఆధ్వర్యంలో పెరెడ్ నిర్వహించి ఘనంగా నిర్వహించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ముందుగా పెరేడ్ కమాండర్ తో గౌరవవందనం స్వీకరించి, పెరేడ్ పరిశీలన అనంతరం ప్లటున్ల వారీగా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించి, వారి నుండి ఆత్మీయ వీడ్కోలు తీసుకున్నారు._

_ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ఈ రెండు సంవత్సరాల కాలంలో చేపట్టిన ప్రతి కార్యక్రమానికి సిబ్బంది అందించిన సహకారం అభినందనీయం, బదిలీల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కి బదిలీ అవుతున్నప్పటికీ మీ యొక్క సేవలను ఎన్నడు నా మదిలో నెమరు వేసుకుంటూ ఉంటానని, మనం అందరం కలిసికట్టుగా ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య కరోనా వైరస్. ఆ సమయంలో లా అండ్ ఆర్డర్ సిబ్బంది కన్న,ఆర్మూర్ రిజర్వ్ పోలీస్ అధికారులు సిబ్బంది అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని, అనునిత్యం రహదారులపై ఉండి శాంతిభద్రతలను పరిరక్షించడంలో ప్రధాన భూమిక పోషించారని కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్,ARSI, ఆర్ ఎస్ ఐ లు,RI లు,DSP, అడిషనల్ ఎస్పీ ఇలా ఒకరిని కాదు, అందరూ ఏ పని గురించి చెప్పిన ఎంతో నిబద్ధత గా విధులు నిర్వర్తించారని, అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఎంతో మంది సిబ్బంది వైరస్ బారినపడి కోలుకున్న, కొంతమందిని కోల్పోయామని, వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు._

_కరొన సమయంలో బెడ్లు దొరక్క ఏ ఒక్క సిబ్బంది ఇబ్బంది పడకూడదని సిబ్బంది సంక్షేమాన్ని కాంక్షించి ప్రత్యేకంగా కోవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేసి 80 మందికి పైగా సిబ్బందికి వైద్య చికిత్స అందజేశామని, అలాగే హోంగార్డ్స్ యొక్క సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలు హోంగార్డ్స్ కూడా వచ్చేలా చర్యలు తీసుకున్నామని, రెండు సంవత్సరాల పాటు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో విధులు నిర్వర్తించామంటే అది అందరి యొక్క కృషి తోనే సాధ్యం అయిందని మీ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు._

_అనంతరం ఎస్పీ గారికి జిల్లా ఆర్మూర్ రిజర్వ్ తరపున ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ గారు, ఇతర అధికారులు శాలువాతో సన్మానించి, జ్ఞాపిక అందజేసి ఎస్పీ గారు సేవలను కొనియాడారు_

Also read_ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి ధర్మేంద్ర గారు, పట్టణ డీఎస్పీలు మాసుం భాష గారు, రాజీవ్ కుమార్ గారు, భరత్ మాతాజి గారు, మోజెస్ పాల్ గారు, రమేష్ గారు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రమణగారు, సి ఐ-2 శ్రీనివాసరావు గారు, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ గారు, పట్టణ సి ఐలు అంకబాబు గారు, భీమరాజు గారు, రమేష్ గారు, కొండయ్య గారు, సన్యాసి నాయుడు గారు, రామకృష్ణ గారు,RI లు శ్రీనివాస రావు గారు, చంద్రశేఖర్ గారు, విజయసారథి గారు, వెంకట్రావు గారు, ఎస్సైలు ఆర్ ఎస్ ఐ లు సిబ్బంది పాల్గొన్నారు._

Total Page Visits: 118 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed