SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేర్చాలి* – రాష్ట్ర భాజప ఆర్టిజెన్ కన్వీనర్ కొండముది బంగారుబాబు.

1 min read

*ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేర్చాలి* – రాష్ట్ర భాజప ఆర్టిజెన్ కన్వీనర్ కొండముది బంగారుబాబు.

ఒంగోలు: భారతీయ జనతాపార్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిసి సంఘం, ఆర్టిజెన్ సెల్ కన్వీనర్ కొండముది బంగారు బాబు నేడు ఒంగోలు పర్యటనకు విచ్చేశారు.

వారి పర్యటనలో భాగముగా నగర బిసి సంఘ కార్యాలయములో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. గోనుగుంట బ్రహ్మానంద శర్మ అధ్యక్షతన వహించిన సమావేశములో చీమకుర్తి కార్పెంటర్ సంఘ అధ్యక్షులు యస్. వీర బ్రహ్మం, రాష్ట్ర కార్పెంటర్ సంఘ పర్యవేక్షక కమిటి సభ్యులు కె. శ్రీనివాసరావు లు వక్తలుగా పాల్గొన్నారు.

సభాసదులను ఉద్దేశించి ముఖ్య అతిధి కొండముది బంగారు బాబు మాట్లాడుచూ కేంద్రం ప్రభుత్వం, ప్రధాని మోది ప్రజా సంక్షేమం కొరకు చేతివృత్తుల వారికి ఎన్నో రకాల పథకాలను ప్రవేశ పెడుచుండగా, ఆ వివరాలు క్రింది స్థాయి వరకు చేరడంలేదని, పథకాలు తెలియక క్రింది స్థాయి చేతి వృత్తుల సోదరులు అభివృద్ధికి నోచుకోవడం లేదని, దాంతో ఎంతో నష్టపోవుచున్నారని తెలిపారు. కుమ్మరి, వడ్రంగి, నాయి బ్రాహ్మణ, చేనేత, కలంకారి, హస్తకళల తదితర చేతివృత్తుల వారు వారివారి తయారి వస్తువులను మార్కెట్ చేసుకొనుటకు “డొమెస్టిక్ మార్కెటింగ్ ప్రమోషన్” డియంపి, “ఎక్స్ పోర్ట్ మార్కెట్ ప్రమోషన్” ఇయంపి లాంటి పథకాలతో స్వయం ఉపాధికై మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ పథకాలను సంఘ నాయకులు అందరికీ తెలిసేలా ప్రచారంచేయాలని కోరారు.

ఈ సందర్భముగా జిల్లా భాజప ఆర్టిజెన్ కన్వీనర్ పిన్నంటి తిరుమల రాష్ట్ర కన్వీనర్ కొండముది బంగారు బాబును సత్కరించారు.

కార్యక్రమములో ఒబిసి జిల్లా అధ్యక్షుడు కటారి సుధాకర్ యాదవ్, బి. శ్రీదేవి, బి. రవణమ్మ, కార్యదర్శి తీగల సత్యవతి, భువనేశ్వరి, పార్వతి, వివిధ బిసి సంఘనాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

Also read

Total Page Visits: 31 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed