SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ద్వారకా తిరుమల ఈవోకు కోర్టు ధిక్కరణ నోటీసులు

1 min read


ద్వారకా తిరుమల,దేవదాయ శాఖ అధికారులు, ద్వారకా తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయ ఈవోలకు రాష్ట్ర హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. దేవస్థానంలో పనిచేస్తున్న 53 మంది ఎన్‌ఎం ఆర్‌లకు 27 శాతం మధ్యంతర భృతి అమలు చేయడం లేదంటూ గతంలో వారు హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు.మధ్యంతర భృతి అమలు చేయాలని గత ఏడాది డిసెంబరులో న్యాయస్థానం ఆదేశాలు జారీచేసినప్పటికీ వాటిని ఇప్పటివరకు అమలు చేయలేదు. దీంతో కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ ఈ నెల 21న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్‌, కమిషనర్‌ అర్జునరావు, ద్వారకాతిరుమల ఆలయ కార్యనిర్వహణాధికారి సుబ్బారెడ్డిలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Total Page Visits: 59 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed