SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

జనసేన బలోపేతానికి కృషి చేయాలి. జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపు.

1 min read

*అమరావతి:*

*జనసేన బలోపేతానికి కృషి చేయాలి…*

*జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపు..*

◆సగటు ప్రజల కన్నీళ్లు తుడిచివేయడంతో పాటు ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు జనసేన పార్టీ అహర్నిశలు కృషి చేస్తోందని జనసేనాని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

*మంగళగిరి లోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశానికి పవన్ హాజరై కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు..*

◆తొలుత కరోనా తో మృతులకు నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు..

*అనంతరం ఇటీవల మృతి చెందిన నంధ్యాలకు చెందిన జనసైనికుడు ఆకుల సోమశేఖర్ కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల చెక్కును జనసేనాని తన చేతుల మీదుగా అందజేశారు..*

*అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… కరోనా విపత్తు కారణంగా దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను కోల్పోయారని, రాష్ట్రంలో ఎంతో మంది జనసైనికులు సైతం కరోనా భారినపడి మృతి చెందడం తననెంతో కలచివేసిందన్నారు..*

◆కరోనాతో కష్ట,నష్టాలను ఎదుర్కొంటూనే ప్రజలకు జనసైనికులు తమ వంతు అండగా నిలవడం అభినందనీయమని కొనియాడారు.

◆నేటి ధన రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో పార్టీని నడపడం చాలా సాహసోపేత నిర్ణయమని, మీ అందరి ఆదరణతోనే పార్టీని నడపగలుగుతున్నామని చెప్పారు.

*భవిష్యత్తు లో జనసేన పార్టీ బలోపేతానికి మరింతగా కృషి చేయాలని కోరారు..*

*జనసేన పార్టీ రాష్ట్ర నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ…* జనసేన పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించేందుకు క్రియాశీలక సభ్యత్వం పొందిన లక్ష మంది కార్యకర్తలకు రూ.2లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించడం జరిగిందన్నారు..

*కరోనా కారణంగా పార్టీకి చెందిన ఎంతో మంది యువతను సైతం కోల్పోవడం ఎంతో బాధాకరమన్నారు..*

Total Page Visits: 103 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed