SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

చెరువులను రక్షించడంతో పాటూ ఆక్రమించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చెయ్యండి-లోక్ సత్తా

1 min read



బొబ్బిలి

చెరువులను రక్షించాలని ఉద్యమం చేస్తున్న వారికి మా లోక్ సత్తా పార్టీ తరపున అభినందిస్తున్నాం. అయితే చెరువులను రక్షించడమే కాదు చెరువులను కబ్జా చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తే ఎక్కువ స్పందన వస్తుందని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు ఆకుల దామోదర రావు అన్నారు. కార్యాలయంలో మాట్లాడుతూ ఆయన అసలు సజీవంగా ఉన్న చెరువులను, భూములను ఆక్రమించేది అధికార పార్టీ నాయకులే. మన బొబ్బిలినే పరిశీలిస్తే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అందులో ఉన్న నాయకులే యదేచ్చగా చెరువులను, భూములను ఆక్రమించి కట్టడాలు కట్టారు, ఇప్పుడు అదే నాయకులు వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే కండువాలు మార్చి తమపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇలా చెరువులను, భూములను ఆక్రమించేవారు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఎవరైనా చెరువులు, భూములను ఆక్రమించడానికి భయపడతారు. దీనిపై అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు కలిసి పోరాడితే ప్రభుత్వంలో కదలిక వస్తుంది.

Read also..


రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో చెరువులు, భూములను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకున్న ఘటనలు చూస్తున్నాం. ఈ మధ్యే వైజాగ్ లో గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములలో అక్రమ కట్టడాలు కట్టారని వాటిని కూల్చెసారు. అక్కడ ఉన్న రాష్ట్ర మంత్రి గారు చెబుతూ ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారు ఎంతటి వారైనా, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అవి ప్రజల ఆస్తి అన్నారు. మరి మన బొబ్బిలిలో అధికార పార్టీ నాయకులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో వారికే తెలియాలి. అలాగే బొబ్బిలిలో ఈ విషయం పై అధిష్టానం స్పందించకపోవడంపై ప్రజలలో చాలా అనుమానాలు కలుగుతున్నాయి. మా లోక్ సత్తా పార్టీ తరపున ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరైనా గానీ ఈ చెరువులు, భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్య‌మం చేస్తే వారికి మా మద్దతు ఉంటుంది. ఈ కార్యక్రమంలో జాతీయ వినియోగదారుల హక్కుల సంరక్షణ సంఘం జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి దాసరి సురేష్ పాల్గొన్నారు.

Total Page Visits: 32 - Today Page Visits: 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed