SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి రాష్ట్రాభివృద్ధికి నిధులు ఎక్కడివి?…సోము వీర్రాజు

1 min read

*భాజప రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పాత్రికేయ సమావేశం*

ఒంగోలు: నేడు ఆదివారం ఒంగోలు నగరానికి విచ్చేసిన భారతీయ జనతాపార్టి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. నగరంలోని కేశవస్వామి పేట ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుచూ…

*రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తూ రాష్ట్ర ప్రజలను అభివృద్ధి చేస్తున్నామంటూ మోసం చేస్తుందని, అప్పుల లెక్కలు, వాని వినియోగం ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు.*

*నాబార్డు ద్వారా జాతీయ రహదారులు, అమృత పథకం తో మున్సిపాలిటీలలో, నగరాలలో రోడ్లు వేస్తున్నాం, ఎన్నాఇసియస్ ద్వారా పంచాయితీలలో పదివేల కోట్లతో పార్కులు, శ్మశానాలు, జిమ్ లకు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.*

*రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయైనా ఖర్చు పెట్టిందా రోడ్ల అభివృద్ధికి? లెక్కలు తేల్చండి అంటూ మున్సిపల్ కార్పోరేషన్ మంత్రికి ఛాలెంజ్ చేశారు*

*గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి రాష్ట్రాభివృద్ధికి నిధులు ఎక్కడివి? అని ప్రశ్నిస్తూ… కేంద్రమే కదా నిధుల వరద పారించిందని వ్యాఖ్యానించారు.*

*పదకొండు వేల కోట్లను రైల్వేల అభివృద్ధి కేంద్రం ఖర్చు పెడితే, కనీసం రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం రైల్వే లైన్ల ఆధునికీకరణకు నిధులు కేటాయించే పరిస్థితిలొ లేదని ఎద్దేవా చేశారు.*

*పోలవరమేనా ఉన్నది?! ఎవరు చూసినా పోలవరం పై మాటలేకాని, వెలుగొండ, గుండ్ల కమ్మ ప్రాజెక్ట్ లపై మాట్లాడేవారేరి! ఆంధ్ర రాష్ట్రంలో పూర్తికాని అరవై జలాశయములు ఉంటే వాటిని గుర్తించరే!*

*రాయలసీమలో 12 వివాదాస్పద ప్రాజెక్ట్ లను, వాటికి కేటాయించిన 3వేల కోట్ల నిధులు వాని నిర్మాణ కాంట్రాక్టర్ల పై తీసుకొన్న చర్యలు ఏవి? వాటిపై వివరణలు ఎక్కడ? అని ప్రశ్నించారు*

*”రాత్రిళ్లు మాటలు,పార్టీలు పగలైతే తెలంగాణా ప్రభుత్వంపై విమర్శలు” ఇవన్నీ ప్రజలను మోసంచేయడం కాదా! అని ప్రశ్నించారు.*

*నాలుగు దశాబ్ధాలుగ రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్ట్ సమస్యలలో ఏ ఒక్కటీ సాల్వ్ చేయలేకపోయారు.*

*నీరులేని జిల్లా ప్రకాశంకు సాగునీటిని అందించడానికి అవసరమైన బడ్జెట్ కేటాయింపులు చేయలేదని విమర్శించారు.*

*జిల్లాకు త్రాగునీటికి 4,5 టియమ్సిల నీరు అందించాలి, గోదావరి నీటిని కృష్ణ ద్వారా మళ్ళించి 10 టియమ్సిల నీరు అందిస్తే జిల్లి సస్యశ్యామలమై శోభిల్లుతుందని వ్యాఖ్యానించారు.*

*కార్మికులకు, ఫిషర్ మెన్ ల అభివృద్ధికి నాలుగు క్లస్టర్లను కట్టాలి, ఒక్కటి పూర్తి కాలేదన్నారు. నాబార్డు ద్వారా కేంద్రం 60శాతం నిధులిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం 40శాతం నిధులను పెట్టుకోలేకపోతుందని విమర్శించారు.*

*డిఫెన్స్, నిన్జ్, ఇండస్ట్రియల్ క్లస్టర్ల పై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిస్పందించక పోవడం, కార్యాచరణకు చలించక పోవడం పై తీవ్రవిచారం వ్యక్తం చేశారు.*

*ఉద్యోగ కల్పనలు, లాభాలు, పరిశ్రమల ఏర్పాటుకై రాష్ట్రానికి కృషిచేయడంలో గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం విఫలమైనవని ఎద్దేవ చేశారు.*

*వీటన్నిటి పై ప్రభుత్వ చొరవకు భారతీయ జనతా పార్టి డిమాండ్ చేస్తుందని వివరించారు.*

*19వ తేది విజయవాడలో “రాష్ట వనరులు – బిజేపి ధృక్కోణం” పేరిట సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, పెండింగ్ ప్రాజెక్ట్ లపై తమ గళం వినిపిస్తామని, రాష్ట్రాభి వృద్ధికై ప్రభుత్వాన్ని తట్టిలేపే విధముగా పోరాటం చేస్తామని వివరించారు.*

*విశాఖపట్నం స్టీల్ ప్రైవేటు పరం కాదని, ప్రైవేటు పరం కాకుండా చూడడానికి భాజప కృతనిశ్ఛయంతో ఉందని తెలిపారు.*

*పెరిగిన పెట్రోల్ ధరలపై స్పందిస్తూ పెట్రోల్ డీజిల్ లను జియస్టి పరిధిలోకి తీసుకొనిరావడానికి కేంద్రం కృషిచేస్తుందని, మరియు పర్యావరణ హానికారకమైన పెట్రో ఉత్పత్తులను తగ్గించడానికి సోలార్ మరియు బ్యాటరి ఉత్పత్తుల వాడకం పెరిగేలా పరిశ్రమలను, ప్రజలను ప్రోత్సహిస్తుందని తెలిపారు.*

*పెట్రోల్ లో ఇథనాల్ కలిపి ధర తగ్గేవిధమైన స్థితికి తేవడానికి కేంద్రం ఆలోచిస్తుందని వివరించారు.*

*ఈ సందర్భముగా పాత్రికేయ మిత్రులు అడిగిన ప్రశ్నలకు సానుకూలంగా సమాధానములు చెప్పారు.*

పాత్రికేయ సమావేశములో ప్రకాశం జిల్లా భాజప అధ్యక్షులు సిరసనగుండ్ల శ్రీనివాసులు, దారా సాంబయ్య, రమేష్ నాయుడు, ధనిశెట్టి రాము, ఐ. సీతారామయ్య, బొద్దులూరి ఆంజనేయులు, మఠంపల్లి దుర్గేష్ మరియు భాజప వివిధ విభాగముల ప్రతినిధులు పాల్గొన్నారు.

Also read

Total Page Visits: 67 - Today Page Visits: 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed