SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

కార్మికుల బకాయిలను వెంటనే చెల్లించాలి డిమాండ్ చేస్తున్న ——పర్మినెంట్ కార్మికులు*
బొబ్బిలి

1 min read

*కార్మికుల బకాయిలను వెంటనే చెల్లించాలి డిమాండ్ చేస్తున్న ——పర్మినెంట్ కార్మికులు*
బొబ్బిలి
బొబ్బిలి పట్టణంలో ఉన్న శ్రీ లక్ష్మీ శ్రీనివాస జూట్ ఫ్యాక్టరీ పర్మినెంట్ ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలని యాజమాన్యాన్ని కార్మిక సంఘం నాయకులు మరియు కార్మికులు డిమాండ్ చేశారు..గత ఆరు నెలలుగా రేపు మాపు అంటూ దాటవేస్తూ ఈనెల 10వ తారీఖు లోగా చెల్లిస్తామని మాట ఇచ్చి తిరిగి జూలై 15 నుండి 20 మధ్యలో చెల్లిస్తామంటూ నోటీస్ బోర్డును పెట్టడం ఎంతవరకు న్యాయమని కార్మికులంతా యాజమాన్యాన్ని ప్రశ్నించారు.. ఇదే చివరి అవకాశమని, 20వ తారీకు లోగా బకాయిలు చెల్లించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని యాజమాన్యాన్ని హెచ్చరించారు..ఆరు సంవత్సరాలుగా బకాయిలు రాక, అప్పులపాలై ఆకలితో అలమటిస్తున్న మని వాపోయారు..కార్మికుల ఆకలిని అర్థం చేసుకుని 20వ తారీఖు లోగా చెల్లింపులు చేయాలని లేకుంటే కార్మికుల ఆకలి చావులు చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.. స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా యాజమాన్యంతో మాట్లాడి బకాయిలను వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు..ఇంచుమించు 100మంది వరకు కార్మికులు జూట్ ఫ్యాక్టరీ ఆవరణలో కొంతసేపు నిరసన వ్యక్తం చేశారు.. ఇప్పటికైనా యాజమాన్యం మరియు ప్రభుత్వం వారు మానవత్వంతో కార్మికుల యొక్క బకాయిలను తక్షణమే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘం నాయకులు అందరూ కోరుతున్నారు…

Read also

Total Page Visits: 53 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed