SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

కళ్ల ముందే పుష్కలంగా నీళ్లున్నా పంటలు వేయలేమని రైతులు క్రాఫ్ హాలిడే ప్రకటించడం నెల్లూరు చరిత్రలో ఇదే మొదటిసారి..*

1 min read

*కళ్ల ముందే పుష్కలంగా నీళ్లున్నా పంటలు వేయలేమని రైతులు క్రాఫ్ హాలిడే ప్రకటించడం నెల్లూరు చరిత్రలో ఇదే మొదటిసారి..*

*850 కిలోల పుట్టికి తేమ పేరుతో 1250 కిలోల వరకు ధాన్యం బలవంతంగా తీసుకోవడం దురదృష్టకరం..*

*అన్నం పెట్టే రైతున్నల సమస్యల విషయంలో ఎమ్మెల్యేల తీరు దారుణం..*

*ముత్తుకూరులో మీడియాతో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి…*

వైసీపీ ప్రభుత్వం రైతుల విషయంలో దారుణంగా ప్రవర్తిస్తోంది..

కళ్లు ముందు పుష్కలంగా సాగునీరు అందుబాటులో ఉన్నా పంటలు వేయలేమని రైతులు దండం పెట్టే పరిస్థితి తెచ్చారు..

నీళ్లున్నా పొలాలను బీడుగా పెట్టేయడం గతంలో ఎప్పుడూ చూడలేదు..

సోమశిల, కండలేరులో నీళ్లున్నప్పటికీ క్రాఫ్ హాలిడే ప్రకటించడం నెల్లూరులో మొదటిసారి..

నీళ్లు కావాలని రైతులు అడిగితే గతంలో శ్రీశైలం నుంచి కృష్ణాజలాలు ఎలా తీసుకురావాలా..అని తపనపడేవాళ్లం..

ఈ రోజు నీళ్లు ఉండి కూడా పంట వేయలేమని రైతులు దండం పెట్టేస్తున్నారు..

దాదాపుగా రెండో పంట క్రాఫ్ హాలిడే ప్రకటించిన పరిస్థితి వచ్చింది..

గత ఏడాది రెండో పంటను రైతులు పుట్టి రూ.8వేలు, రూ9 వేలకు తెగనమ్ముకున్నారు…

చివరకు ప్రభుత్వానికి అమ్మితే పుట్టికి పుట్టి ఏదుం, పుట్టి పందుం తీసుకుంటున్నారు..ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదు..

ఇప్పుడు కూడా 850 కిలోల పుట్టికి 1050 కిలోల నుంచి 1250 కిలోలు తీసుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

తేమ పేరుతో పుట్టి ఏదుం తప్పనిసరి చేశారు..పుట్టి పందుం వడ్లు కూడా లాక్కుంటున్నారు..

పెట్టుబడి పెరిగిపోయింది..ధర తగ్గిపోయింది..మరోవైపు తేమ పేరుతో దోపిడీ జరుగుతుండటం చూసి పంట పెట్టడమే మానుకున్నారు..

రైతులు ఈ రెండేళ్లలో ఆందోళనకరమైన పరిస్థితిని గడుపుతున్నారు..

రెండో పంట సమయంలోనూ నిస్సహాయ స్థితిలో ధాన్యాన్ని తెగనమ్ముకున్నారు..

ఇప్పుడు మొదటి పంట విషయంలోనూ రూ.12 వేలు, రూ.13 వేలకు తగ్గించారు..మద్దతు ధర ప్రకారం పుట్టికి రూ.16,040 చెల్లించాలి…

నెల్లూరు ఆనకట్ట వద్ద పడిన గండిని పూడ్చడం ఆలస్యమై వల్లూరు, క్రిష్ణపట్నం, జాపర్ సాహెబ్ కాలువల కింద పంట పెట్టడం రెండు నెలలు ఆలస్యమైపోయింది..

సకాలంలో నీళ్లు లేక దిగుబడులు సరిగా రాక కొన్ని చోట్ల వరికోతలు కూడా కోయకుండా వదిలిపెట్టేశారు..

ఈ రోజు డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం కూడా రైతులపై పరోక్షంగా పడుతోంది..

నెల్లూరు జిల్లా అంటే అన్నపూర్ణ…నాణ్యమైన మొలగొలుకుల వడ్లు, మంచి ధాన్యం, మంచి బియ్యం అనే పేరు ఉండేది..

ఈ రోజు అదిపోయి రైతులు అప్పులపాలై ఇళ్లలో కూర్చునే పరిస్థితి వచ్చింది..

నెల్లూరు జిల్లాలో ప్రధానంగా డెల్టా ప్రాంతమైన సర్వేపల్లి, కోవూరు నియోజకవర్గాల్లోనే లక్ష ఎకరాలకు పైగా పంట పండుతుంది..

రైతుల గిట్టుబాటు ధర, వారికి ఎదురవుతున్న ఇబ్బందుల గురించి పట్టించుకోడానికి ఒక్క ఎమ్మెల్యే అయినా అరగంట సమయం కేటాయించారా..

రైతులు ధాన్యం సగం ధరకు అమ్ముకుంటుంటే ఎమ్మెల్యేలుగా బాధ్యత తీసుకుని కనీసం సీఎంని కలిసి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నారా..

ఓట్లు వేసి గెలిపించిన రైతులను ఎమ్మెల్యేలు ముంచేశారు..

అన్నంపెట్టే రైతన్నల విషయంలో వారు వ్యవహరిస్తున్న తీరు దారుణమైనది…క్షమించరానిది.

Also read

Total Page Visits: 94 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed