SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ఆర్దిక వితరణ—-శిష్టి కరణం వాట్సప్ గ్రూప్

1 min read



విజయనగరం

విజయనగరం పట్టణంలో శ్రీ పైడితల్లి అమ్మవారి కళ్యాణ మండపంలో శిష్టకరణం వెల్ఫేర్ అసోసియేషన్ అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా విజయనగరం జిల్లా గరివిడి వాస్తవ్యులైన భోగిల శ్రీదేవి కి సహాయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈమె భర్త అకాల మరణం చెందడం వల్ల, ఆవిడ ఇద్దరు పిల్లలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే, ఈ విషయం శిష్టకరణం లేఖ ద్వారా తెలుసుకొని, శిష్టకరణం వెల్ఫేర్ అసోసియేషన్ అనే వాట్సాప్ గ్రూప్ స్పందించి గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ మెసేజ్ అందించగా, అందులో ఉన్న కొంతమంది సభ్యులు ఎవరికి తోచినంత వాళ్ళు అమౌంట్ ఇచ్చారు. అందులో సునాబెడ లో ఉంటున్న పాల్తేరు శ్రీనివాసరావు గారు 5,000/- క్యాష్ మరియు, 9,000/- విలువచేసే కుట్టు మిషన్ శ్రీదేవి గారికి అందించడం జరిగింది.పాల్తేరు శ్రీనివాస రావు మాట్లాడుతూ శిష్టకరణం సంఘంలో పేద వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న శిష్టకరణం వెల్ఫేర్ అసోసియేషన్ అనే వాట్సాప్ గ్రూపు వెంటనే స్పందించి అందరినీ కలుపుకుపోయి, వాళ్లకి ఒక రకమైన ఆర్థికంగా భరోసా ఇవ్వడం ఎంతో సంతోషకరమైన విషయం అని చెప్పారు. పక్కి ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ ఈ శిష్టకరణ వెల్ఫేర్ వాట్స్ అప్ గ్రూపు ద్వారా సభ్యుల సహకారంతో మేము చేసిన మూడవ సహాయ కార్యక్రమమని , గ్రూపు సభ్యులు స్వచ్చందంగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు దన్యవాదాలు తెలిపారు. త్యాడ ప్రసాద్ పట్నాయక్ మాట్లాడుతూ ఒక శిష్టకరణ కుటుంబానికి చేయూత నిచ్చే ఇటువంటి కార్యక్రమము లో పాల్గున్నందుకు చాలా ఆనందగా ఉందని, శ్రీదేవి కుటుంబంలాంటి మరెన్నో కుటుంబాలకు చేయూత నివ్వాలని, సమిష్టి కృషితోనే ఇది సాధ్యమని అన్నారు మరియు మిగతా సభ్యులు తల చేయి వేసి 10,500/- ఇవ్వడం జరిగింది. ఆవిడ బ్రతుకు తెరువు కోసం మొత్తంగా 15 ,500 నగదు మరియు కుట్టు మిషను అందించడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా పక్కి ఉమామహేశ్వర మరియు సంజుక్త పట్నాయక్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి త్యాడ ప్రసాద్ పట్నాయక్, జి వి ఆర్ పట్నాయక్, అనిల్ కుమార్, బెహరా విజయ, భరత్ తదితరులు పాల్గొన్నారు.

Also read

Total Page Visits: 163 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed