SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

అక్రమంగా తరలిస్తున్న 5 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

1 min read


-ఈతకోట జంక్షన్ వద్ద విజిలెన్స్ అధికారుల తనిఖీలు
– వ్యానులో తరలిస్తున్న 90 బస్తాల బియ్యం సీజ్

పశ్చిమ గోదావరి జిల్లా ఖండవల్లి నుంచి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వ్యానును రావులపాలెం మండలం ఈతకోట వద్ద గురువారం రాత్రి విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ అధికారులు సీజ్ చేసారు. పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దార్, రాజమహేంద్రవరం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈతకోట జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ వ్యానులో అక్రమంగా తరలిస్తున్న 90 బస్తాల్లో ఉన్న 5 టన్నుల రేషన్ బియ్యం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వ్యాన్ డ్రైవర్ గుబ్బల వీరబాబుతో పాటు పలివెల ‌సత్యనారాయణ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఆలమూరుకు చెందిన పసలపూడి గంగరాజు అనే వ్యక్తి ఈ బియ్యం రవాణా చేయిస్తున్నట్లు వారు తెలిపారు. సీజ్ చేసిన వ్యాన్, బియ్యం బస్తాలను శుక్రవారం రావులపాలెం పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పి. బుజ్జిబాబు తెలిపారు.

Total Page Visits: 136 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed