SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

పిడుగురాళ్ల లో నిరుపయోగంగా ప్రభుత్వ భవనాలు

1 min read

*పిడుగురాళ్ల లో నిరుపయోగంగా ప్రభుత్వ భవనాలు*

*పిడుగురాళ్ల జూలై 29 న్యూస్*


పిడుగురాళ్ల పట్టణం లోనే ఐదవ వార్డులో నిరుపయోగంగా మారిన ప్రభుత్వ భవనాలు. పులిచింతల ప్రాజెక్టు డాక్టర్ కె.ఎల్.రావు సాగర్ క్రింద నిర్వాసితులు కొరకు నిర్మితమైన 960 గృహాలు నిర్వాసితుల కొరకు కు నిర్మించారు. వారికి మౌలిక వసతులు కొంతవరకు కల్పించారు. దీనిలోని భాగంగా నిర్మించిన ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ,పశువుల ఆస్పత్రి, వాణిజ్య సముదాయం, పంచాయతీ ఆఫీస్, కమ్యూనిటీ హాలు, అంగన్వాడీ బిల్డింగ్, ప్రాథమిక స్కూలు భవనాలు నిర్మాణం చేశారు. కొన్ని కార్యాలయాలు వాడుకలో ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య భవనం, కమ్యూనిటీ హాలు భవనాలు నిర్మించి వాటిని ఉపయోగించకుండా సంవత్సరాల తరబడి ఖాళీగా ఉండటంతో కార్యాలయానికి సంబంధించిన తలుపులు, దర్వాజాలు ,కిటికీలడోర్లు చెదలు పట్టి పిచ్చి చెట్లు కంప చెట్లు పెరిగి భయానక వాతావరణం నెలకొంది. దీనికి తోడు ఆ భవనాల్లో అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారినాయి.అక్కడ సుమారు మూడు వందల కుటుంబాలకు పైనే ప్రజలు నివసిస్తున్నారు. కానీ అక్కడ ప్రజలకు ఎటువంటి వైద్య సౌకర్యం లేదు. చిన్న అనారోగ్యం సమస్యలు వచ్చినా వైద్యం కోసం సుమారు 5 కిలో మీటర్ల ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.కావున ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నిరుపయోగంగా ఉన్న భవనాలను వినియోగం లోకి తెచ్చి,ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని పునఃప్రారంభం చేసి సిబ్బందిని నియమించి ప్రజల ప్రాణాల ను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు వాపోతున్నారు.

Also read

ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓ ఇంట్లో దంపతుల మృతదేహాలు

Total Page Visits: 325 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed