SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

మూడు రాజధానుల బిల్లు వెనక్కు : ఎపి ప్రభుత్వం కీలక నిర్ణయం

1 min read

మూడు రాజధానుల బిల్లు వెనక్కు : ఎపి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

* మండలి రేపటికి వాయిదా
* మూడు రాజధానుల అంశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం.

* అత్యవసర క్యాబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకుంటారని విస్తఅత ప్రచారం.
* ప్రస్తుతం ఉన్న బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకునే ఆలోచన.

* కొన్ని మార్పులతో కొత్తగా మళ్లీ సభలో మూడు రాజధానుల బిల్లు

అమరావతి : ఎపి అసెంబ్లీ సమావేశాలు మూడవ రోజు ప్రారంభమయ్యాయి. సోమవారం సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు.

* అసెంబ్లీలో దిశ చట్టంపై చర్చలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ… మహిళలపై జరిగే నేరాలను నియంత్రించగలిగామని తెలిపారు. 89 లక్షల మందికిపైగా దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని చెప్పారు. ప్రతి పిఎస్‌లో ఉమెన్‌ హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశామన్నారు. దిశ చట్టంపై ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలను నిర్వహించామని సుచరిత పేర్కొన్నారు.

* కులగణనను తక్షణమే చేపట్టాలని కోరుతూ… నేడు అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టనుంది. బిసి సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాకృష్ణ వెనుకబడిన తరగతుల కులాలవారీ జనగణన పై తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అనంతరం దీనిపై సభలో చర్చ జరగనుంది. ప్రస్తుత సెషన్‌ను బహిష్కరిస్తున్నట్లు టిడిపి సభ్యులు ఇప్పటికే ప్రకటించిన సంగతి విదితమే. దీంతో ఈరోజు సమావేశానికి కూడా వారు హాజరుకావడం లేదు. ఈ నేపథ్యంలో అధికారపక్షమే పూర్తిగా సమావేశాలను నిర్వహించనుంది. వ్యవసాయ సహకార మార్కెటింగ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఎపి ఉద్యాన నర్సరీల రిజిస్ట్రీకరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అనంతరం బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీ సంక్షేమంపై లఘు చర్చ జరగనుంది. ప్రశ్నోత్తరాల్లో ఎయిడెడ్‌, పెట్రోలియం ఉత్పత్తులపై సెస్‌, దిశ యాప్‌, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు, జగనన్న విద్యా దీవెన, బిసి ఉప ప్రణాళిక నిధులు మళ్లింపు అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలపై ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది. ముఖ్యంగా 2014-2019 మధ్యకాలంలో బగ్గు దిగుమతి అంశంపైనా చర్చించనున్నారు.

Also real

Total Page Visits: 95 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed