SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

మద్యం షాపుల్లో చోరీ.. ఆ షాపులే టార్గెట్‌గా దోపిడీ..

1 min read

మద్యం షాపుల్లో చోరీ.. ఆ షాపులే టార్గెట్‌గా దోపిడీ.. వారి పనేనా అంటూ వ్యక్తమవుతున్న అనుమానాలు..

కృష్ణా జిల్లాలో ఉన్న పలు ప్రభుత్వ వైన్ షాపుల్లో చోరీ జరిగింది. నందిగామలోని రెండు ప్రభుత్వ మద్యం షాపుల్లో తాళాలు..
కృష్ణా జిల్లాలో ఉన్న పలు ప్రభుత్వ వైన్ షాపుల్లో చోరీ జరిగింది. నందిగామలోని రెండు ప్రభుత్వ మద్యం షాపుల్లో తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. అర్థరాత్రి సమయంలో చోరీకి పాల్పడిన దొంగలు.. వాచ్‌మెన్‌పై దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామలోని చందాపురం రోడ్డులోని మద్యం షాపు, నందిగామ జాతీయ రహదారిపై ఉన్న మద్యం షాపుల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. అయితే, షాపుల్లోని కౌంటర్లలో పెద్ద మొత్తంలో డబ్బులు లేకపోవడంతో కౌంటర్‌లో ఉన్న రూ. 1,500 తీసుకుని ఉండాయించారు.

కాగా, ఒక షాపు వద్ద వాచ్‌మెన్‌పై దాడి చేసిన దుండగులు.. మరో షాపు వద్ద వాచ్‌మెన్ ఉన్నా చోరీ జరుగడం అనుమానాలకు తావిస్తోంది. ఈ దోపిడీ గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. చోరీకి గురైన వైన్ షాపులను పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఇంటి దొంగల పనేనా? లేక దొంగలకు సహకరించారా? అనే కోణంలో పోలీసులు దర్యా్ప్తు జరుపుతున్నారు. వాచ్‌మెన్‌ను విచారించడంతో పాటు.. వైన్ షాపుల వద్ద ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Also read

Total Page Visits: 216 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed