SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

వరాహాల వ్యానును అపహరించి పరారైన అగంతకులు

1 min read

విశాఖ జిల్లా పాయకరావుపేట

: వరాహాల వ్యానును అపహరించి పరారైన అగంతకులు


ఎస్కార్ట్ పోలీసుల కళ్ళు కప్పి జాతీయ రహదారిపై పందుల వ్యానును అపహ రించిన గుర్తు తెలియని అగంతకులు.
పోలీసులు తేరుకుని అపహరణకు గురైన వ్యానును వెంబడించారు.
పోలీసులను గమనించిన అగంతకులు చివరకు వ్యాను వదిలి పరారయ్యారు.

సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన విశాఖ పట్నం జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద చోటుచేసు కుంది.

దీనికి సంబంధించిన వివరాల్లోకెళితే విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పోలీస్ ఎస్కార్ట్ సహాయంతో తమిళనాడు రాష్ట్రానికి పందులు తర లిస్తున్నారు. విశాఖ జిల్లాలోకి అడుగి డిన వ్యానును గురువారం అర్ధరాత్రి మార్గమధ్యలో కొంతమంది అగంతకు లు ఎస్కార్ట్ వాహనం కళ్ళుకప్పి వరాహాల (పందులు)వాహనాన్ని అడ్డగించారు. డ్రైవర్ ను క్రిందకులాగి వాహనాన్ని అపహరించి ఉడాయించా రు. దీంతో వాహనం డ్రైవర్ ఎస్కార్ట్ పోలీసులకు పోన్ చేసి విషయం తెలియజేయగా… ఎస్కార్ట్ పోలీసులు నక్కపల్లి పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన నక్కపల్లి పోలీసులు వ్యానును గుర్తించి దానిని వెంబడించగా… వేంపాడు టోల్ ప్లాజా వద్ద వాహనాన్ని వదిలి అక్కడనుంచి అగంతకులు పరారయ్యారు.

ఈ ఘటనపై నక్కపల్లి పోలీసులు కేసు నమోదుచేసి నిందితుల కోసం గాలిస్తు న్నారు.

Total Page Visits: 84 - Today Page Visits: 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed