SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

కృష్ణా నదిలో భూకంపం..! శ్రీశైలం ప్రాజెక్ట్‌కు తప్పిన ముప్పు

1 min read

హైదరాబాద్‌ : నల్లమలలోని కృష్ణా నదిలో సోమవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం ఐదు గంటల సమయంలో కొన్ని సెకన్లపాటు భూమి కంపించిందని, భూకంప లేఖినుల్లో దీని తీవ్రత 3.7గా నమోదైనట్లు ఎన్‌జిఆర్‌ఐ ప్రధాన శాస్త్రవేత్త శ్రీనగేశ్‌ తెలిపారు.

కృష్ణా నదిలో భూకంప కేంద్రం..
హైదరాబాద్‌లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ) వివరాల మేరకు… నల్లమల అడవుల్లో 7 కిలోమీటర్ల లోతున భూకంపం వచ్చింది. ఉదయం ఐదు గంటల సమయంలో శ్రీశైలం జలాశయానికి పడమర వైపు 44 కి.మీ దూరంలో, నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌కు తూర్పున 18 కి.మీ దూరంలో కఅష్ణానదిలో భూకంప కేంద్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.

శ్రీశైలం డ్యాం వద్ద సెన్సార్ల సంకేతాలు
భూకంపం నేపథ్యంలో… శ్రీశైలం డ్యాం భూగర్భ గ్యాలరీతోపాటు ఈగలపెంటలో భూ ప్రకంపనలను గుర్తించే రెండు సెన్సార్లున్నాయి. భూ ప్రకంపనలను అవి వెంటనే గుర్తించి ఎన్‌జిఆర్‌ఐకి సంకేతాలు పంపాయి. అనంతరం ఎన్‌జిఆర్‌ఐ అధికారులు ప్రకంపనల తీవ్రతను శ్రీశైలం డ్యాం అధికారులకు పంపించారు. భూకంపానికి కారణాలపై అధ్యయనం చేస్తున్న అధికారులు ఆత్మకూర్‌ ఫాల్ట్‌ కారణమని అంచనా వేస్తున్నారు. అక్కడి భూమిలోని రాతిపొరల్లో ఏర్పడిన ఒత్తిడి భూకంపానికి దారితీసి ఉంటుందని శాస్త్రవేత్త శ్రీనగేశ్‌ పేర్కొన్నారు.

భయంతో పరుగులు తీసిన ప్రజలు..
నల్లమలలోని అచ్చంపేట పట్టణం, కొల్లాపూర్‌, లింగాల, అమ్రాబాద్‌, పదర, ఉప్పునుంతల, బల్మూరు మండలాలతోపాటు శ్రీశైలం సమీప గ్రామాలు, గిరిజన గూడేల ప్రజలు భూకంపం తీవ్రతతో ఉలిక్కిపడ్డారు. కొన్ని ఇళ్లల్లోని సామాన్లు భారీ శబ్ధాలతో కిందపడటంతో జనం భయందోళన చెందారు. కొన్ని ప్రాంతాల్లో 4 సెకన్లు, మరికొన్ని చోట్ల మూడు సెకన్లు భూకంపం ప్రభావం చూపిందని, ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశామని ప్రజలు తెలిపారు.

శ్రీశైలం ఆనకట్టకు తప్పిన ముప్పు
చిన్న భూకంపం కావడం వల్ల శ్రీశైలం ఆనకట్టకు పెద్ద ముప్పు తప్పింది. శ్రీశైలం ఆనకట్ట దక్షిణం వైపు ఒకటి రెండుసార్లు ప్రకంపనలు గతంలో వచ్చినా.. అవి చాలా చిన్నవని పరిశోధకులు తెలిపారు. శాస్త్రవేత్త శ్రీనగేశ్‌ మాట్లాడుతూ…. శ్రీశైలం ఆనకట్టను నిర్మించినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ ప్రాంతంలో భూకంపాలు ఎప్పుడూ రాలేదని, ఇదే మొదటిసారి అని చెప్పారు. ఉదయం నుంచి ఒక్కసారే భూమి కంపించిందని, చిన్న భూకంపమే కావడంతో నల్లమల పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

ఇది టెక్టానిక్‌ ఎఫెక్ట్‌ : శాస్త్రవేత్తలు
సాధారణంగా నీటి ప్రవాహాలతో భూమి లోపల ఉన్న పగుళ్లలో సర్దుబాటుతో భూమి కంపిస్తుంది. దీన్నే టెక్టానిక్‌ ఎఫెక్ట్‌ అని అంటారని, ఇలాంటి సందర్భాల్లో ఎక్కువసార్లు భూమి కంపిస్తుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కారణంగానే భూమి కంపించి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

వరద కారణం కాదు : శాస్త్రవేత్తలు
ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి 4 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తుతోంది. నీటి నిల్వ అంతకంతకూ పెరుగుతోన్న నేపథ్యంలో భూ ప్రకంపనలు చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది. పులిచింతలలో గతేడాది జనవరి నుంచి నవంబరు వరకు ఇలాంటి భూ ప్రకంపనలను ఎన్‌జిఆర్‌ఐ శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడ భూమి పొరల్లోని పగుళ్లలో నీటి సర్దుబాటే కారణమని నిర్ధారణకు వచ్చారు. రాత్రి వరకు నల్లమలలో మళ్లీ ప్రకంపనలు వచ్చినట్లు రికార్డు కాలేదని, దీన్నిబట్టి వరద కారణంగా వచ్చిన భూ ప్రకంపనలు అనుకోలేమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Also Read

కన్న పిల్లలపై మాజీ ఎమ్మెల్యే కుమారుడి నీచమైన పనులు.. స్నేహితుడితో కలిసి దారుణం.. పోక్సో చట్టం కింద కేసు!

Total Page Visits: 160 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed