SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

అప్పులు చేయని ప్రభుత్వాలను చూపండి : ఎంపి మోపిదేవి

1 min read

గుంటూరు..సంక్షేమ పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ అప్పులు చేయడం అనివార్యమని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు అన్నారు. గుంటూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రూ.6 లక్షల కోట్లు అప్పులు చేసిందని, అయితే అభివృద్ధి జరగడం లేదని, జగన్‌ ఫెయిల్యూర్‌ సిఎం అని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అప్పులు చేయని రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. జ్యోతిరావు ఫూలే వంటి మహనీయులు కలలుగన్న రీతిలో బడుగు, బలహీనవర్గాలకు కూడా పదవులిచ్చి, వారి ఆర్థిక స్వావలంబనకు సిఎం జగన్‌న్మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని, అందుకోసం పలు పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా బిసిలకు అధిక ప్రాధాన్యమిస్తూ వారి కోసం ప్రత్యేకంగా పథకాలు తెచ్చారన్నారు. బిసి జనగణనపై అసెంబ్లీ తీర్మానానికి అనుగుణంగా వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావిస్తామని చెప్పారు. ఈ అంశంపై కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఆయనవెంట ఎమ్మెల్యే ముస్తఫా, జెడ్‌పి చైర్‌పర్సన్‌ హెనీక్రిస్టినా, గుంటూరు డిప్యూటీ మేయర్‌ బాలవజ్రబాబు పాల్గొన్నారు.

Also read

Total Page Visits: 105 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed